- Advertisement -
ముంబై: ప్రో కబడ్డీ లీగ్ 2018 సీజన్-6లో ‘డుబ్కీ’ కింగ్ ప్రదీప్ నర్వాల్ 16 పాయింట్లుతో చెలరేగడంతో పాట్నా పైరేట్స్ ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్ 38–35 స్కోరుతో దబాంగ్ ఢిల్లీపై గెలుపు సాధించింది. ప్రదీప్‌తో పాటు మంజీత్ 8 పాయింట్లతో రాణించాడు. దబాంగ్ ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు.
ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో.. యు ముంబా 36–22 స్కోరుతో తమిళ్ తలైవాస్‌పై ఘన విజయం సాధించింది.
ప్రో కబడ్డీ లీగ్‌లో అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగే మ్యాచ్‌లు..
గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ Vs బెంగాల్ వారియర్స్
జైపూర్ పింక్ పాంథర్స్ Vs యూపీ యోధా
- Advertisement -