33.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ Konidela Nagababu: ఏపీ గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా కొణిదెల నాగబాబు

Konidela Nagababu: ఏపీ గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా కొణిదెల నాగబాబు

- Advertisement -

అమరావతి (ఆగస్టు 17): ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ప్రభుత్వం బాధ్యతాయుతమైన కీలక పదవిని అప్పగించింది.

‘ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్’ (AP GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పదవిలో ఉన్నంత కాలం ఆయనకు ప్రత్యేకంగా కేబినెట్ హోదా (Cabinet Rank) కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

50 శాతం పచ్చదనమే లక్ష్యంగా ప్రణాళికలు…

పర్యావరణ సమతుల్యతను కాపాడటం, రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని సమూలంగా పెంపొందించడం, అటవీ విస్తీర్ణాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేయనుంది. ‘వికసిత్ ఆంధ్రప్రదేశ్-2047’ విజన్ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతానికి పచ్చదనాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

నాగబాబు సారథ్యంలో ఈ కమిటీ రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటిస్తూ హరిత ప్రాజెక్టులు, మొక్కలు నాటే కార్యక్రమాల పర్యవేక్షణను వేగవంతం చేయనుంది.

హర్షం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్…

సోదరుడు నాగబాబుకు కీలక బాధ్యతలు దక్కడంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ-అటవీ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, కూటమి నాయకులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

నాగబాబు నాయకత్వంలో పునర్వనీకరణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు మరింత వేగంగా ముందుకు సాగుతాయని, భావి తరాలకు పచ్చని ఆంధ్రప్రదేశ్‌ను అందించే లక్ష్యాన్ని విజయవంతంగా నెరవేరుస్తారని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -