33.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home లైఫ్ స్టయిల్ ఆధ్యాత్మికం వినాయక చవితి వ్రత ముహూర్తం.. ఈ నియమాలు పాటిస్తే శుభఫలితాలు!

వినాయక చవితి వ్రత ముహూర్తం.. ఈ నియమాలు పాటిస్తే శుభఫలితాలు!

- Advertisement -

హైద‌రాబాద్‌: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావించే వినాయక చవితి వ్రతానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో భాద్రపద మాస శుక్ల పక్ష చవితి తిథి సెప్టెంబర్ 14 సోమవారం నాడు రావడంతో, అదే రోజున గణపతి వ్రతాన్ని ఆచరించాలని పండితులు స్పష్టం చేస్తున్నారు.

ముహూర్తం మరియు పూజా సమయం
వినాయక చవితి పూజను ఎప్పుడూ సూర్యోదయం తర్వాత, అపరాహ్ణ కాలానికి ముందు లభించే ‘అభిజీత్ ముహూర్తం’లో ఆచరించడం అత్యంత శ్రేష్ఠం. పండుగ రోజు ఉదయం 7:44 గంటల నుంచే చవితి తిథి ప్రారంభమైనప్పటికీ.. పూజా కార్యక్రమాలను ఉదయం 9:30 గంటల నుంచి మొదలుపెట్టి, మధ్యాహ్నం 11:45 నుంచి 12:20 గంటల మధ్య ఉన్న అభిజీత్ ముహూర్తంలో వ్రతాన్ని పూర్తి చేసుకుంటే విశేషమైన దైవానుగ్రహం లభిస్తుంది.
పూజా విధానం – పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు

మట్టి గణపతి స్థాపన: ఇళ్లలో కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే పూజించాలి. ఇంటి తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య భాగంలో స్థలాన్ని ఎంచుకుని, గోమయంతో అలికి పీఠం వేయాలి. దానిపై ఒక వస్త్రాన్ని పరిచి, కొద్దిగా బియ్యం, తమలపాకు ఉంచి విఘ్నేశ్వరుడిని ప్రతిష్టించాలి.

శోడశోపచార పూజ: ప్రతిష్ఠించిన‌ స్వామివారికి పాలవెల్లి కట్టి, శోడశోపచార పూజలు, అష్టోత్తర శతనామావళి, 21 రకాల పత్రాలతో ఏకవింశతి పూజ నిర్వహించాలి.

కథా శ్రవణం: వ్రతంలో భాగంగా శమంతకమణి కథతో పాటు పూజలోని ఐదు పవిత్ర కథలను భక్తిశ్రద్ధలతో చదువుకుని, పూజా అక్షింతలను శిరస్సున ధరించాలి.

ఈ పవిత్ర రోజున వినాయక వ్రతాన్ని నిష్టతో ఆచరిస్తే, సంవత్సరం పొడవునా ఉండే ప్రతి చవితి రోజు పూజించినంత మహత్తర ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. “విద్యార్థి లభతే విద్యం.. ధనార్థి లభతే ధనం” అన్నట్లుగా.. ఈ రోజు లంబోధరుడిని పూజించడం వల్ల చదువుకునే పిల్లలకు చక్కని విద్య, వ్యాపారులకు ధన ప్రాప్తి, ఉద్యోగార్థులకు సదుపాయాలు, సంతానార్థులకు సంతాన భాగ్యం కలిగి, రాబోయే ఏడాది పొడవునా ఎలాంటి విఘ్నాలు లేకుండా సకల శుభాలు చేకూరుతాయి.

- Advertisement -