33.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుతో కేంద్ర మంత్రి జేపీ నడ్డా భేటీ!

చంద్రబాబుతో కేంద్ర మంత్రి జేపీ నడ్డా భేటీ!

- Advertisement -

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పర్యటనలో ఉన్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. శనివారం ఉదయం ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్న కేంద్ర మంత్రికి చంద్రబాబు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు కొంతసేపు సరదాగా ముచ్చటించి, రాష్ట్రానికి సంబంధించిన పలు సాధారణ అంశాలపై చర్చించారు.

అంతకుముందు, విజయవాడ వేదికగా జరిగిన ఒక కీలక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జేపీ నడ్డా సంయుక్తంగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.249 కోట్ల భారీ అంచనా వ్యయంతో నిర్మించిన 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లను వర్చువల్ విధానంలో నేతలు ప్రారంభించారు.

కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే కూటమి ప్రభుత్వాలు ఉండడం వల్ల సంక్షేమ, అభివృద్ధి ఫలాలు వేగంగా అందుతాయని, ఈ ‘డబుల్ ఇంజిన్’ పాలనతోనే వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు సాధ్యమవుతాయని వారు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ అధికారిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు జేపీ నడ్డా ఆయన నివాసానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -