అహ్మదాబాద్: ప్రో కబడ్డీ లీగ్‌లో చరిత్రలో తొలిసారిగా తమిళ్ తలైవాస్ చేతిలో తెలుగు టైటాన్స్ ఓటమి పాలైంది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తలైవాస్ 27-23 స్కోరుతో టైటాన్స్‌ను ఓడించింది. రైడింగ్‌లో అజయ్ ఠాకూర్ 8 పాయింట్లు సాధించగా, కీలక సమయంలో మంజీత్ చిల్లర్ మూడు ట్యాకిల్ పాయింట్లు కొల్లగొట్టి తలైవాస్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
తెలుగు టైటాన్స్ చెత్త డిఫెన్స్…
తెలుగు టైటాన్స్ జట్టు తరుపున రాహుల్ చౌదరి రైడింగ్‌లో 8 పాయింట్లతొ అదరగొట్టినా ఫలితం లేకపోయింది. చెత్త డిఫెన్స్‌తో జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. ఐదో నిమిషంలో ఇరు జట్లు 4-4తో సమంగా ఉన్నా, తలైవాస్ అద్భుత ట్యాక్లింగ్‌తో 4 పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి వెళ్లారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి తలైవాస్ 13-6 స్కోరుతో నిలిచింది.
ఆట రెండవ అర్ధ భాగంలో పుంజుకొన్న తెలుగు టైటాన్స్… ప్రత్యర్థి స్కోరును అందుకునేందుకు విఫలయత్నం చేసింది. తెలుగు టైటాన్స్ మ్యాచ్ మొత్తంలో కేవలం 7 పాయింట్లతో సరిపెట్టుకుంది. ఆరంభం నుంచే ఆధిక్యం ప్రదర్శించిన తమిళ్ తలైవాస్ తొలి అర్ధభాగానికి 18-10తో ముందంజలో ఉంది. ఆ తరువాత కూడా తమిళ తలైవాస్ ఈ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకుని విజయన్ని అందుకుంది.
గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌పై.. దబాంగ్ ఢిల్లీ విజయం
ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ జట్టు 29-26 స్కోరుతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను ఓడించింది. గుజరాత్ జట్టులో సచిన్ 9 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దబాంగ్ ఢిల్లీ జట్టులో మిరాజ్ షేక్ 7 పాయింట్లతో అద్భుతంగా ఆడాడు. దబాంగ్ ఢిల్లీ జట్టులో మిగిలిన ప్లేయర్లు నవీన్ 5 పాయింట్లు , రవీందర్ 4 పాయింట్లు, రాజేశ్ 3 పాయింట్లతో రాణించారు.
ఇక గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ జట్టు తరుపున సచిన్ 9 పాయింట్లు, పర్వేష్ 6 పాయింట్లు, సునీల్ 3 పాయింట్లు, డోంగ్ 3 పాయింట్లు చేశారు..
ప్రో కబడ్డీ లీగ్‌లో బుధవారం జరిగే మ్యాచ్‌లు…
తమిళ్ తలైవాస్ x పట్నా పైరేట్స్
యు ముంబా x గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్