- Advertisement -
బెంగళూరు: వీవో ప్రో కబడ్డీ సీజన్ 7లో ఆదివారం హోం గ్రౌండ్ కంఠీరవ స్టేడియంలో.. సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ జట్టు రంకెలేసింది. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ ఏకంగా 17 పాయింట్లతో చెలరేగి తమిళ్ తలైవాస్ జట్టును మట్టికరిపించాడు.
అయితే తమిళ్ తలైవాస్ జట్టు కూడా ఆద్యంతం గట్టి పోటీనిచ్చింది. కానీ చివరికి వచ్చేసరికి మాత్రం ఆ జట్టు తన ఓటమిని అంగీకరించక తప్పలేదు. 6 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్ జట్టును మట్టికరిపించి.. బెంగళూరు బుల్స్ జట్టు తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది.
- Advertisement -