
- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు (సోమ, మంగళవారాల్లో) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని తెలిపారు. వచ్చే 24 గంటల్లో వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
దీని ప్రభావంతో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గత రెండుమూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
- Advertisement -








