33.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home ట్రెండింగ్ న్యూస్ Chanakya Strategies Survey: తెలంగాణలో ఈసారి బీఆర్‌ఎస్‌దే అధికారం: చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో వెల్లడి

Chanakya Strategies Survey: తెలంగాణలో ఈసారి బీఆర్‌ఎస్‌దే అధికారం: చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో వెల్లడి

- Advertisement -

హైదరాబాద్, 2 సెప్టెంబరు 2026: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (BRS) అధికారంలోకి రావడం ఖాయమని ‘చాణక్య స్ట్రాటజీస్ సర్వే’లో వెల్లడయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఈ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఈ సర్వేలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై 3.6 శాతం ఆధిక్యంలో బీఆర్‌ఎస్ ఉండడం వల్ల తెలంగాణలో ఈసారి అధికార మార్పు తప్పదనే సంకేతాలకు బలం చేకూరుతోంది.

ఈ సర్వే కోసం ‘చాణక్య స్ట్రాటజీస్’ రాష్ట్ర వ్యాప్తంగా 1,06,810 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించింది. కాంగ్రెస్‌‌కు 37.1 శాతం ఓటర్లు మద్దతు పలుకగా.. 40.7 శాతం మంది ఓటర్లు బీఆర్‌ఎస్‌‌కు జై కొట్టినట్లు సర్వేలో తేలింది.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తవుతున్న వేళ.. ప్రభుత్వం, అధికార పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? రాబోయే ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా తెలంగాణ యువత ఏమనుకుంటున్నారు? ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉంది? తదితర అంశాలపై రెండు నెలలపాటు క్షేత్ర స్థాయిలో సమగ్రమైన సర్వే నిర్వహించినట్లు ‘చాణక్య స్ట్రాటజీస్’ వివరించింది.

దీంతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, అధికారం కైవసం చేసుకునేది బీఆర్ఎస్ అని తమ సర్వేలో వెల్లడియినట్లు ‘చాణక్య స్ట్రాటజీస్’ తెలిపింది.

ప్రభుత్వం పనితీరు, ప్రతిపక్ష పార్టీల పనితీరు, ఆయా నియోజక వర్గాలలో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు నుంచి అభివ‌ృద్ధి, సంక్షేమ పథకాల అమలు, గ్రామీణ సమస్యలు, ఉద్యమకారుల సమస్యలు, నిరుద్యోగం, జెన్‌ జీ ఆలోచనలు, కొత్త రాజకీయ పార్టీల ప్రభావం వంటి పలు అంశాలపై ఈ సర్వే నిర్వహించినట్లు పేర్కొంది.

అడ్డగోలు హామీలతో ఓట్లరను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన వెయ్యి రోజుల్లో హామీల అమలులో ఘోరంగా విఫలమైందని, ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారని పేర్కొంది.

- Advertisement -