అహ్మదాబాద్: ప్రో కబడ్డీ లీగ్‌లో శనివారం గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, బెంగళూరు బుల్స్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. రెండు జట్లు నువ్వా.. నేనా అన్నట్లు తలపడగా, ఎట్టకేలకు ఈ మ్యాచ్ 30-30తో ‘డా’గా ముగిసింది.
తొలి 6 నిమిషాల వరకు మ్యాచ్ హోరాహోరీగా సాగినప్పటికీ.. తర్వాత బెంగళూరు బుల్స్ జట్టు మ్యాచ్‌పై ఆధిపత్యం సాధించింది. తొలి అర్థభాగం ముగిసేసరికి బెంగళూరు బుల్స్ 18-12 స్కోరుతో ఆధిక్యంలో నిలిచింది.
అయితే రెండో అర్ధభాగంలో.. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ పుంజుకుని బెంగళూరును బుల్స్ దూకుడుని అడ్డుకుంది. 33వ నిమిషంలో 26-26తో స్కోరు సమమైన దగ్గర్నుంచి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది.
ఇరు జట్లూ హోరాహోరీగా తలపడటంతో మ్యాచ్ చివరికి ‘డ్రా’గా ముగిసింది. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ జట్టు రైడర్ సచిన్ 10 పాయింట్లతో మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బెంగళూరు బుల్స్ జట్టులో పవన్ 8 రైడ్ పాయింట్లు సాధించాడు.
మారో మ్యాచ్‌లో.. బెంగాల్ వారియర్స్ ఐదో విజయం…
ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ ఐదో విజయం నమోదు చేసుకుంది. బెంగాల్ వారియర్స్ 26-22 స్కోరుతో పుణేరి పల్టన్ గెలిచింది.
గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన బెంగాల్ వారియర్స్ ఈ మ్యాచ్‌లో చెలరేగింది. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది.
మరో 4 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా 18-19 స్కోరుతో వెనుకబడి ఉన్న బెంగాల్ వారియర్స్ రైడర్ మణీందర్ 6 పాయింట్లతో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించడంతో ఆ జట్టు అనూహ్యంగా పుంజుకుని గెలుపొందింది. పుణేరి పల్టస్ తరఫున జీబీ మోరె 9 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు.