హైదరాబాద్: మామా అల్లుళ్లు పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా మరో మూడు రోజుల్లో వెండితెరపై విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అందరిలోనూ, అన్ని స్థాయిల్లోనూ అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.
పేరుకు తమిళం నుంచి తెలుగులోకి రీమేక్ సినిమానే అయినా.. ‘బ్రో’ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్‌లు చూస్తుంటే తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు అనువుగా ఈ సినిమాలో చాలా మార్పులే చేసినట్లు అనిపిస్తోంది.
మరోవైపు ‘భీమ్లా నాయక్’ తరువాత పవన్ నటించిన సినిమా ‘బ్రో’ కావడంతో.. ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఈ సినిమాతో మామ అల్లుళ్లు ఇద్దరూ ఒకేసారి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుండడంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించిన 15వ సినిమా, పైగా తమిళంలో సూపర్ హిట్టయిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది.
పీపుల్ మీడియా బ్యానర్‌పై ఫాంటసీ డ్రామా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సాయిధరమ్‌కు జోడీగా కేతిక శర్మ నటిస్తుంది. మరో మూడు రోజుల్లో అంటే.. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో ‘బ్రో’ మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్‌లతో బిజీగా కాలం గడిపేస్తున్నారు. ఇక సినీ అభిమానుల గురించి చెప్పాలంటే.. ముందుగా గుర్తోచ్చేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే.
పవన్ కళ్యాణ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచమంతటా తిరుగులేని ఫ్యానిజం ఉంది. ఆయన సినిమా విడుదల సమయంలో భారీ కటౌట్‌లు, ఫ్లెక్స్‌లతో ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.
అమెరికాలో పవన్ ఫ్యాన్స్ హంగామా…
తాజాగా అటు అమెరికాలో పవన్ ఫ్యాన్స్ బ్రో సినిమా రిలీజ్ సందర్భంగా టెస్లా కార్లతో సినిమా టైటిల్ లైట్ షో నిర్వహించారు. యూఎస్‌ఏలో మూడు చోట్ల ఈవెంట్ జరిగినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది.
మరోవైపు ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పటికే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ రూ.100 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఒక్క ఆంధ్ర ఏరియాలోనే దాదాపు రూ.50 కోట్ల రేంజ్‌లో ఈ సినిమా బిజినెస్ జరిగినట్లు సమాచారం.
ఇక ఓవర్సీస్‌లో రూ.13 కోట్లు డీలింగ్ ఇప్పటికే ఫిక్సయిందని, నైజాం సహా మిగిలిన ఏరియాలు అన్ని కలుపుకుని మొత్తంగా రూ.100 కోట్ల ఫిగర్ దాటిందని చెబుతున్నారు.
ఒక రీమేక్ సినిమాకే ఈ రేంజ్‌లో బిజినెస్ జరుగుతుందంటే.. తెలుగు సినీ పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Aerial View #BroTheAvatar https://t.co/dd5Dw6Xzp9 pic.twitter.com/S6SUh9LDM2
— scan the bans (@chirucharanfan) July 24, 2023
Tesla Light Show in Dallas by MEGA Fans #BroTheAvatar pic.twitter.com/unJ49mnnL9
— scan the bans (@chirucharanfan) July 24, 2023