ఎరవెల్లిలో సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం ‘చిత్ర’మాలిక…

5:33 pm, Mon, 19 November 18
kcr raja syamala yagam photos

తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల యాగం చేపట్టారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ యాగం ఆదివారం ప్రారంభమయింది. సోమవారం ఉదయం 11.11 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించగా, రాత్రికి..  ఏకరాత్రి దీక్షలు ఉంటాయి.

తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ శాంతులతో జీవించాలని, తెలంగాణ రాష్ట అభివృద్ధి కోసం తలపెట్టిన కార్యాలు పరమేశ్వరుడి దయతో దిగ్విజయంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ సీఎం కేసీఆర్ ఈ యాగం తలపెట్టారు.

రాజశ్యామల యాగంలో భాగంగా సూర్య నమస్కారాలు, మహాలింగార్చన, అన్ని గ్రహాలకు హోమాలు, చండీయాగం నిర్వహించారు. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో జరిగిన ఈ యాగంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 75 మంది రుత్వికులు పాల్గొన్నారు. సిఎం కేసీఆర్ సతీమణి శోభ, ఇతర కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

cm-kcr-raja-syamala-yagam-1     cm-kcr-raja-syamala-yagam-2

cm-kcr-raja-syamala-yagam-3     cm-kcr-raja-syamala-yagam-4

cm-kcr-raja-syamala-yagam-5     cm-kcr-raja-syamala-yagam-6

cm-kcr-raja-syamala-yagam-7     cm-kcr-raja-syamala-yagam-8

cm-kcr-raja-syamala-yagam-9

cm-kcr-raja-syamala-yagam-10     cm-kcr-raja-syamala-yagam-11[/vc_column_text][/vc_column][/vc_row]