Rain Alert: ఏపీ, తెలంగాణలో.. నేడు, రేపు విస్తారంగా వర్షాలు: వాతావరణ శాఖ

- Advertisement -

హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. రెండు రాష్ట్రాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని, ఫలితంగా ఏపీలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని పేర్కొంది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అల్లూరి, మన్యం, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలున్నట్లు తెలిపింది.

ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో ఇటు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వచ్చే రెండ్రోజుల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు.

చదవండి: శిరస్సు వంచిన శిఖరం! పర్వతారోహణలో.. హైదరాబాద్ వండర్ కిడ్ కార్తికేయ!!

 

- Advertisement -