గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ చివరి భేటీ, కేటీఆర్ ట్వీట్…

telangana-cm-kcr-governor-narasimhan
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణకు కొత్త గవర్నర్‌‌గా తమిళిసై సౌందర్‌రాజన్ నియమితులైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మర్యాద పూర్వకంగా కలిశారు. దాదాపు గంటన్నర సేపు ఇద్దరి మధ్య చివరి భేటి జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్దికి సహకరించిన గవర్నర్ నరసింహన్‌కు.. సీఎం కేసిఆర్ కృతజ్ఝతలు తెలియజేశారు. 

కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్‌కు నూతన గవర్నర్‌గా విశ్వభూషన్‌ను నియమించిన కేంద్రం తాజాగా తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందర్‌రాజన్‌ను నియమించింది. 

ఇక గవర్నర్ నరసింహన్ తెలుగు రాష్ట్రాల్లో సుధీర్ఘకాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన డిసెంబర్ 27, 2009న ఉమ్మడి అంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బాద్యతలు చేపట్టారు. అనంతరం 2014లో రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగారు.

ఈ నేపథ్యంలోనే భారత దేశంలో ఎక్కువ కాలం గవర్నర్ పదవిని చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డ్ బ్రేక్ చేశారు. గవర్నర్ గా నియమించినప్పటి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ వివాదరహితుడిగా కొనసాగారు. దీంతో భారత దేశ చరిత్రలోనే ఎక్కువ కాలం గవర్నర్ సేవలు అందించిన వ్యక్తిగా ఈఎస్ఎల్ నరసింహన్ రికార్డు సృష్టించారు. 

కేటీఆర్ ట్వీట్…

మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా గవర్నర్ నరసింహన్‌కు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సంధర్భంగా గవర్నర్ నరసింహన్‌తో తనకున్న అనుభూతులను కేటీఆర్‌ పంచుకున్నారు. అనేక సందర్భాల్లో పలు అంశాలపై ఆయనతో సంభాషించే అవకాశం తనకు కలిగిందని పేర్కొన్నారు.  

గత పదేళ్లుగా నర్సింహన్ రాష్ట్రానికి అనేక విషయాల్లో దిశా నిర్ధేశం చేశారని తన ట్వీట్‌లో పేర్కొన్న కేటీఆర్.. ఆయనతో దిగిన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

- Advertisement -