32.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home ట్రెండింగ్ న్యూస్ తెలంగాణలో ‘సర్‌’ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల: 92 లక్షల మందికి నోటీసులు

తెలంగాణలో ‘సర్‌’ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల: 92 లక్షల మందికి నోటీసులు

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (Special Intensive Revision – SIR) ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి మాట్లాడూతూ ముసాయిదా ఓటర్ల జాబితాకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.

ఈ సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయనున్నట్లు సీఈవో స్పష్టం చేశారు. అందులో దాదాపు 73 లక్షల మందిని ASD (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డూప్లికేట్) కేటగిరీ కింద గుర్తించినట్లు తెలిపారు.

నోటీసులు అందుకున్న ఓటర్లు తమ వివరాలు సరిచూసుకుని, వివరణ ఇచ్చేందుకు సెప్టెంబర్ 16 వరకు గడువు కల్పించారు. జాబితాలో పేరు లేని కొత్త ఓటర్లు ఫారం 6A ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

ప్రచురించిన ఈ ముసాయిదా జాబితా ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరు సరిచూసుకునే విధానం:
  • మొదట ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ https://www.eci.gov.in/ ను సందర్శించండి.
  • హోమ్‌పేజీలో కనిపించే “SIR Download Electoral Roll” లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ రాష్ట్రం (తెలంగాణ) ఎంచుకోండి.
  • ఆపై సంబంధిత జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, భాషను ఎంపిక చేయండి.
  • మీ పార్ట్ నంబర్ లేదా పోలింగ్ కేంద్రం పేరును ఎంచుకుని, స్క్రీన్‌పై ఉన్న క్యాప్చా (Captcha) కోడ్‌ను నమోదు చేసి PDF ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ఆ PDF లో మీ పేరు లేదా EPIC నంబర్‌ ఆధారంగా వివరాలు సరిచూసుకోవచ్చు.
- Advertisement -