

న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్, పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షోయెబ్ మాలిక్ భార్య సానియా మీర్జాపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై ట్రోలింగ్‌కు దిగుతున్నారు. సానియా తాజాగా తీసుకున్న తన ఫోటోను సానియా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
పుల్వామా ఉగ్రదాడి పై సానియా స్పందన…
ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ పుల్వామా ఉగ్రదాడి గురించి స్పందించకుండా ఇలా ఫోటోలు పోస్ట్ చేస్తావా?` అంటూ పలువురు సానియా దేశభక్తిని ప్రశ్నిస్తూ కామెంట్లు చేస్తున్నారు. నీ ఫోటో చూసే ఆసక్తి మాకు లేదు. అంత పెద్ద దాడి జరిగితే దాని గురించి కనీసం స్పందించకుండా ఇలా ఫోటోలు అప్‌లోడ్ చేస్తావా, సిగ్గులేదు, స్వార్థం.. నువ్వు భారతీయురాలివేనా? దేశ రక్షణ వ్యవస్థపై జరిగిన దాడిని పట్టించుకోవా అంటూ ఆమెపై ట్రోలింగ్ చేస్తున్నారు.
ఆమె పాకిస్థాన్‌కు చెందిన మహిళ. ఈ దాడి గురించి స్పందించడానికి ఆమె ఇష్టపడదు అంటూ చాలా మంది నెటిజన్లు ఆమెపై సోషల్ మీడియా వేదికగా దాడికి దిగుతున్నారు. ఇది మరింత ఎక్కువ కావడంతో ట్విటర్ ద్వారా సానియా పుల్వామా దాడిని ఖండించింది.
పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడి నాకు ఎంతో బాధను కలిగించింది. ఆ జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఈ ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు ఉండకూడదు. శాంతి కోసం ప్రార్థించండి అని సానియా ట్వీట్ చేసింది.
చదవండి : పాక్ పెద్ద తప్పు చేసింది, భారీ మూల్యం తప్పదు: ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ అంటూ మోడీ వార్నింగ్








