25.2 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం పాక్ పెద్ద తప్పు చేసింది, భారీ మూల్యం తప్పదు: మోడీ వార్నింగ్, ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ...

పాక్ పెద్ద తప్పు చేసింది, భారీ మూల్యం తప్పదు: మోడీ వార్నింగ్, ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ అంటూ…

- Advertisement -

Narendra Modi-pak

న్యూఢిల్లీ: పాకిస్థాన్ పెద్ద తప్పు చేసిందని.. పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ దీటైన జవాబు ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపారు. ఢిల్లీలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించిన మోడీ.. ఇది అమరవీరుల త్యాగాలకు అంకితమని అన్నారు. అనంతరం ఉగ్రదాడిపై మాట్లాడుతూ.. భారత్‌ను అస్థిరపరిచేందుకు ముష్కరులు చేస్తున్న ప్రయత్నాలు సాగవని స్పష్టం చేశారు.

పుల్వామా ఉగ్రదాడికి 130 కోట్ల భారతీయులు దీటైన జవాబిస్తారని మోడీ పేర్కొన్నారు. ఉగ్రదాడిని ఖండించిన దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉగ్రదాడి వెనుక ఉన్నవారు తప్పక శిక్ష అనుభవిస్తారన్నారు. ఉగ్రవాదులను అంతమొందించేందుకు భద్రతాబలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని ప్రధాని స్పష్టం చేశారు. వారి ధైర్యసాహసాలపై పూర్తి నమ్మకముందని స్పష్టం చేశారు.

దేశ రక్షణ, దేశ అభివృద్ధి కోసం ప్రాణాలు అర్పించిన అమరుల సేవలను ప్రతి క్షణం గుర్తించుకుంటామని అన్నారు. వీర సైనికుల త్యాగాలను ఏ మాత్రం వృథాగా పోనివ్వమని స్పష్టం చేశారు.

పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు: మోడీ

కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడుతూ… పాకిస్థాన్‌ చాలా పెద్ద తప్పు చేసిందని, దాడికి పాల్పడినవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పుల్వామాలో ఉగ్రదాడి ఘటనతో దేశ ప్రజల రక్తం మరిగిపోతోందని తెలిపారు.

ఇలాంటి దాడులతో భారతదేశ సమగ్రతను, స్థిరత్వాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. మానవతావాదులంతా ఏకమై ఉగ్రవాదులపై పోరాటానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై రాజకీయాలు అనవసరమని, ప్రతిపక్ష పార్టీలన్నీ ఏక తాటిపైకి రావాలన్నారు. ఉగ్రవాదంపై కలసికట్టుగా పోరాడదామన్నారు. సైనికుల ధైర్యం, త్యాగాలు వెలకట్టలేనివని అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని మోడీ భరోసా ఇచ్చారు.

ఉగ్రదాడిని ఖండించిన ప్రపంచ దేశాలు

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల ఘాతుకాన్ని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఉగ్రదాడిలో అమరులైన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన అమెరికా.. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు భారత్‌తో కలిసి పోరాడుతామని ప్రకటించింది. పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం మానుకోవాలని అమెరికా హెచ్చరించింది.

ఉగ్రదాడిని అమానవీయ చర్యగా పేర్కొన్న రష్యా.. ఉగ్రవాదుల అంతానికి ప్రపంచ దేశాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది. ఫ్రాన్స్‌, జర్మనీలు కూడా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడిని హేయమైన చర్యగా అభివర్ణించిన ఆస్ట్రేలియా.. ఉగ్రపోరులో భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. బంగ్లాదేశ్‌, శ్రీలంకలు అమరుల కుటుంబాలకు తమ సానుభూతిని ప్రకటించాయి.

ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. అమరుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన ఐక్యరాజ్యసమితి.. జై షే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ మసూర్‌ అజార్‌పై భారత్‌ ప్రతిపాదించిన నిషేధానికి ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలని కోరింది.

సంబంధిత వార్తలు

అతిపెద్ద ఉగ్రదాడి: సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి, 40 మంది జవాన్లు మృతి

ఆలోగా నేను స్వర్గంలో ఉంటా: ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది అదిల్

పుల్వామా ఘటన : పక్కా ప్లాన్‌తోనే దాడి? అమరులైన 43 మంది జవాన్లు!

సంభాషణ అనేది గదుల్లో కా‍కుండా..యుద్ధ మైదానంలో ఉండాలి! యుద్దానికి సిద్దంకండి గౌతమ్ గంభీర్!

పాకిస్తాన్‌కు ఎంఎఫ్ఎన్ హోదా ఉపసంహరించిన భారత్, తక్షణమే అమల్లోకి…

 

- Advertisement -