22.6 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ వైసీపీలోకి వలసల పర్వం! త్వరలోనే జగన్ గూటికి పల్లె?

వైసీపీలోకి వలసల పర్వం! త్వరలోనే జగన్ గూటికి పల్లె?

Palle-Raghunath-Reddy , newsxpress.online
- Advertisement -

Palle-Raghunath-Reddy, newsxpress

ప్రస్తుతం ఏపీలో రాజకీయం ఊపందుకుంది. మరికొన్ని రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలకి నోటిఫికెషన్ వెలువడనున్న సందర్భంలో నేతలు తమ పెదవులని నిలుపుకోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ నుండి కీలకనేతలు వైసీపీలోకి వస్తున్నారు. చంద్రబాబు తీరుతో విసుగుచెందిన నేతలు వైసీపీ బాట పడుతున్నారు.

ఇకపోతే పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేస్తే కనీసం పోటీ ఇవ్వగల నేత పల్లె రఘునాథరెడ్డి. ఆయన కాకుండా ఆ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు పోటీచేసినా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ సాధించడం ఖాయమనే విశ్లేషణలు స్థానికంగా ఎక్కువగా వినిపిస్తున్నాయి.

రాజ్యసభ మీదే దృష్టి..

ఇప్పుడు పల్లె రఘునాథ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గ మారింది. వాస్తవానికి పల్లె ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఆయన చూపు రాజ్యసభ మీద ఉంది. ఇప్పటికే పల్లె రాజకీయంగా చాలా హోదాల్లో పని చేశారు. రాజ్యసభతో రిటైరయిపోవాలనే భావనతో ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ మేరకు చంద్రబాబుకు కూడా ప్రతిపాదన పంపించారట. అయితే పల్లెకు రాజ్యసభ సభ్యత్వం పట్ల చంద్రబాబు నాయుడు భరోసా ఇవ్వడంలేదని తెలుస్తోంది. కొన్నాళ్ల కిందట అవమానకరంగా మంత్రిపదవి నుంచి తప్పించారు. అప్పుడే రఘునాథ రెడ్డి అసహనభరితుడు అయ్యాడు. ఆర్థికశక్తి విషయంలో పల్లె బలీయమైన స్థితిలో ఉన్నారు.

ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశంలో ఉండి అవమానాలు ఎదుర్కొనడం కన్నా వైదొలగడమే మంచిదని ఆయన భావిస్తున్నారట. అందులో భాగంగా వైసీపీతో సంప్రదింపులు జరుపుతున్నారని.. తన ప్రస్తుత స్వప్నం రాజ్యసభ సీటు విషయంలో భరోసా లభిస్తే పల్లె తెలుగుదేశాన్ని వీడటం ఖాయమని సమాచారం అందుతోంది. చూడాలి మరి ఎన్నికల సమయంలో కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుంటే అధినేత ఏ వ్యూహంతో ముందుకువస్తాడో..

- Advertisement -