33.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం: ద్వాదశ రాశుల జాతక ఫలితాలు.. పాటించాల్సిన నియమాలు!

ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం: ద్వాదశ రాశుల జాతక ఫలితాలు.. పాటించాల్సిన నియమాలు!

- Advertisement -

హైదరాబాద్: శతాబ్దంలోనే అత్యంత అరుదైన ఖగోళ వింతలలో ఒకటైన ‘సంపూర్ణ సూర్యగ్రహణం’ (Total Solar) భౌగోళిక పరిస్థితులపై ఎలాంటి ప్రభావం చూపబోతోందనే అంశంపై ప్రముఖ జ్యోతిష్య నిపుణులు సమగ్ర విశ్లేషణ అందించారు.

భారతదేశంలో ఈ గ్రహణం కనిపించే అవకాశం ఉందా? సూతక కాలం పాటించాలా? ద్వాదశ రాశుల వారిపై దీని ప్రభావం ఎలా ఉండబోతోందనే వివరాలు ఇక్కడ చూద్దాం.

ఎక్కడ కనిపిస్తుంది?: ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రధానంగా ఆర్కిటిక్, గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్,అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

భారత్‌లో ఉందా?: భారతదేశంలో ఈ సూర్యగ్రహణం పాక్షికంగా కూడా కనిపించదు (Not Visible in India). భారత ప్రామాణిక కాలమానం ప్రకారం రాత్రి వేళలో ఈ గ్రహణం సంభవిస్తుండటంతో దేశంలో ఎక్కడా దృశ్యం కాదు.

సూతక కాల నియమాలు: శాస్త్ర నియమాల ప్రకారం గ్రహణం కనిపించని ప్రాంతాల్లో ఎలాంటి ‘సూతక కాలం’ (Sutak Kaal) వర్తించదని, దేవాలయాల మూసివేత లేదా నియమాలు పాటించాల్సిన అవసరం లేదని పండితులు స్పష్టం చేశారు.

జ్యోతిష్య ప్రభావం & ద్వాదశ రాశుల ఫలితాలు…

భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ, గ్రహాల సంచారం మరియు రాశిచక్రంపై ఈ సూర్యగ్రహణం కొంత ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

కర్కాటక, వృశ్చిక, మీన రాశులు: ఈ రాశుల వారికి గ్రహణ ప్రభావం సానుకూలంగా ఉంటుంది. ధన లాభం, ఉద్యోగంలో పురోగతి, ఆకస్మిక విజయం లభించే అవకాశాలు ఉన్నాయి.

మేష, సింహ, ధనుస్సు రాశులు: మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త వహించడం మంచిది.

వృషభ, మిథున, కన్య, తులా, మకర, కుంభ రాశులు: ఆరోగ్య విషయాలు, వ్యాపార లాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

భౌగోళిక, మానసిక మార్పులు…

ప్రపంచవ్యాప్తంగా సూర్యగ్రహణం జరిగే సమయంలో వాతావరణంలో కొన్ని మార్పులు, సముద్రపు అలల ఉద్ధృతిపెరగడం, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలకు ఆస్కారం ఉంటుందని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.

గ్రహణ సమయంలో ధ్యానం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గి మనశ్శాంతి లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు వివరించారు.

- Advertisement -