

బెంగళూరు: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు శనివారం స్వదేశంలో తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను నడిపారు. తేజస్‌కు కో-పైలట్‌గా వ్యవహరించారు. కాగా, తేజస్ యుద్ధ విమానానికి కో-పైలట్‌గా పనిచేసిన తొలి మహిళగా పీవీ సింధు రికార్డు సాధించారు.
అరుదైన గౌరవం.. గొప్ప అనుభూతి
అనంతరం సింధు మాట్లాడుతూ.. తేజస్ యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం రావడం తనకు దక్కిన అరుదైన గౌరవమని అన్నారు. తనకు గొప్ప అనుభవమని.. విమానాన్ని నడిపేందుకు అవసరమైన సూచనలను కెప్టెన్ తనకు ఇచ్చారని వివరించారు.
వింగ్ కమాండర్‌తోపాటు ఆమె విమానంలో ప్రయాణించారు. ‘సింధు చాలా తొందరగా ఎత్తును, వేగాన్ని అందుకున్నారు. ఓ డ్యాం వద్ద మేము కొన్ని దాడులు చేశాం. 5 నిమిషాలుపాటు జరిగిన దాడిలో సింధు కూడా భాగస్వామి అయ్యారు’ అని ఎయిర్‌ఫోర్స్ అధికారి తెలిపారు.
ఎయిర్ షోలో నాలుగో రోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఏరో ఇండియా విమెన్స్ డే వేడుకలను నిర్వహించింది. యెలహంకలోని ఎయిర్ బేస్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో మరో ముగ్గురు మహిళా ఐఏఎఫ్ ఫైటర్ పైలట్లు కూడా హాక్-1 విమానాన్ని నడిపారు. కాగా, విమెన్స్ డే వేడుకల్లో భాగంగా వ్యోమగామి సునీతా విలియమ్స్ కూడా తేజస్‌లో ప్రయాణించినట్లు తెలిసింది.
చదవండి: ఎయిర్ షోలో భారీ అగ్ని ప్రమాదం: 300 వాహనాలు దగ్ధం, సిగరెట్టే కారణమా?








