

విజయవాడ: 2019 ఎన్నికల తర్వాత రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ అన్నారు. శనివారం విజయవాడలో లోక్‌సత్తా పార్టీ నిర్వహించిన ‘2019 ఎన్నికలు… ప్రజల మానిఫెస్టో’ రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో పార్టీలు లేవు.. వర్గాలు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రస్తుత రాజకీయాలు నిరాశాజనకంగా ఉన్నాయని, ఈ లోక్‌సభ ఎన్నికల తర్వాత పెను మార్పు వస్తాయన్నారు. దేశంలో, రాష్ట్రంలో జరుగుతోంది ఎలక్షన్ కాదు.. యాక్షన్ అని జేపీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు అడ్మినిస్ట్రేషన్ చేయటం లేదు కలెక్షన్ చేస్తున్నాయని మండిపడ్డారు.
కుల, మతం, వర్గం రూపాలలో సమాజాన్ని వేరుచేసి ఎన్నికల్లో గెలుపుం కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. విభజన హామీలు కేంద్రం నెరవేర్చలేదన్నది సుస్పష్టం మన్న జేపీ.. పెత్తందారి రాజకీయాలు కేంద్రం, రాష్ట్రంలో రావడం దారుణన్నారు. రాష్ట్రా అభివృద్ధి గురించి మాట్లాడితే సీఎం చంద్రబాబుకు సపోర్ట్ చేసినట్టు కాదని స్పష్టం చేశారు.
ప్రాంతీయ పార్టీలే కీలకం
ప్రజాస్వామ్యం విలువలకు పెద్ద పీట వేసింది లోక్‌సత్తా పార్టీయేనని జేపీ వ్యాఖ్యానించారు. పన్నులు కట్టే ప్రజల జీవితాలను మార్చాలి.. కానీ, ప్రజలను బిచ్చగాళ్లుగా చేయడం సరికాదన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే అధికార వికేంద్రీకరణ జరగాలన్నారు. అమరావతిలో జరుగుతున్న పనులపై ఢిల్లీ నిర్ణయాలు అవసరం లేదన్న జేపీ.. వచ్చే ఎన్నికల్లో ప్రాతీయ పార్టీల ప్రభావం లేకుండా ప్రభుత్వాలు ఏర్పడబోవని స్పష్టం చేశారు.
చట్టబద్ద పాలన దేశంలో జరగటం లేదని, తప్పు జరిగితే దండించే వ్యవస్థ రావాలని అన్నారు. చట్టం ప్రకారం పౌరులందరికి సమన్యాయం ఉండాలని.. విద్యా, ఆరోగ్యం, అందించకుండా పేదరికం రూపుమాపలేమన్నారు. ఇక ప్రభుత్వాలకు ప్రజల కంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే భయమని ఎద్దేవా చేశారు. లంచం లేకుండా గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేసే విధానం రావాలని ఆకాంక్షించారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై పార్టీ నాయకులతో చర్చించి వారం రోజులలో ప్రకటిస్తామని తెలిపారు.
చదవండి: ఎన్నికల్లో డబ్బులు పంచారు!: బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు








