

బెంగళూరు: ఏరో ఇండియా-2019 వైమానిక ప్రదర్శన జరుగుతున్న బెంగళూరులోని యలహంక ఎయిర్‌బేస్ స్టేషన్ సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మూడు వందలకుపైగా కార్లు, ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతైనట్లు అధికారులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పదికిపైగా అగ్నిమాపక శకటాలు చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పార్కింగ్ స్థలంలో కొన్ని వందల కార్లు, ద్విచక్రవాహనాలు ఉన్నాయి.
ప్రమాదానికి తాగిపడేసిన సిగరెట్టే కారణమా?
మంటలు ఉవ్వెత్తున ఎగసి పడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, సిగరెట్ కాల్చి పడేయడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందన వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ పార్కింగ్ స్థలానికి సమీపంలో కొన్ని విమానాలను కూడా ఉంచినట్లు తెలుస్తోంది.
Vehicles got fire at parking area of #AiroIndia show at Yalahanka. Fire fighters On the spot.@DGP_FIRE @SunilagarwalI @KarnatakaVarthe pic.twitter.com/5YAk2izsDx
— ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಅಗ್ನಿಶಾಮಕ ಮತ್ತು ತುರ್ತು ಸೇವೆಗಳು (@KarFireDept) February 23, 2019
ప్రమాదం కారణంగా ఎయిర్ షోను తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా, ఫిబ్రవరి 20 నుంచి 24వ తేదీ వరకు ఈ ఎయిర్ షో జరగనుంది. దీంతో ఎయిర్ షోను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు.








