

వాషింగ్టన్: పుల్వామా దాడికి పాల్పడి 40మందికిపైగా సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ నాయకుడు మసూద్ అజార్‌కు వ్యతిరేకంగా చైనా మినహా అగ్రదేశాలన్నీ ఏకమయ్యాయి. మసూద్ అజార్‌ను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఐక్యరాజ్యసమితిని కోరాయి.
అయితే, మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత డిమాండ్‌పై చైనా ప్రతికూలంగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. బ్రిటన్,అమెరికా, ఫ్రాన్స్‌ల తాజా వైఖరిపై చైనా ఇంకా స్పందించలేదు.
మసూద్‌పై ఆంక్షలు విధించాలి..
మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించాలని, ఆయన ఆస్తులను సీజ్ చేయాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు పదిహేను మంది సభ్యులతో కూడిన భద్రతా మండలి శాంక్షన్స్ కమిటీకి విజ్ఞప్తి చేశాయి. కాగా ఏకాభిప్రాయంపై నిర్ణయం తీసుకునే కమిటీలో ఈ ప్రతిపాదనపై మార్చి 13లోగా సభ్యులు తమ అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది.
గతంలో 2016, 2017లో మసూద్ అజార్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని భద్రతా మండలి కమిటీ ఎదుట భారత ప్రతిపాదన వచ్చిన క్రమంలో ఉగ్రవాదిగా ఓ సంస్థ లేదా వ్యక్తిని నిర్వచించేందుకు స్పష్టమైన నిబంధనలున్నాయని, ఈ నిబంధనలను సంబంధిత ఐరాస కమిటీ క్షుణ్ణంగా పరిశీలించాలంటూ ఈ ప్రతిపాదనకు చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.








