25 C
Hyderabad
Saturday, August 29, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ! భారీ కార్చిచ్చులో లక్షలాది ఎకరాలు…

వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ! భారీ కార్చిచ్చులో లక్షలాది ఎకరాలు…

- Advertisement -

వాషింగ్టన్: భారీ కార్చిచ్చు అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తోంది. అక్కడి అటవీ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు ఇప్పటివరకు 2.5 లక్షల ఎకరాలను బూడిదగా మార్చింది.

పరిస్థితి విషమించడంతో వాషింగ్టన్ రాష్ట్ర గవర్నర్ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఈస్ట్ వాషింగ్టన్ సహా పలు ప్రాంతాల్లో జాతీయ వాతావరణ కేంద్రం రెడ్ ఫ్లాగ్ హెచ్చరికను జారీ చేసింది.

మరోవైపు ఇప్పటికే వందలాది ఇళ్లను ఖాళీ చేయించారు. ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా వేల సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

కోట్లాది అమెరికన్లపై ప్రభావం…

ఇప్పటివరకు దాదాపు 2.3 లక్షల మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ కార్చిచ్చు ప్రభావం 5 కోట్ల మందికి పైగా అమెరికన్లపై ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

అక్కడి అటవీ ప్రాంతంలో బలమైన గాలులు వీస్తుండడంతో మంటలు వేగంగా చుట్టుపక్కలకు వ్యాపిస్తున్నాయి. ఈ కార్చిచ్చును ఆర్పడానికి 4,000 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, నేషనల్ గార్డ్ బృందాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఈ మంటలు వేగంగా విస్తరించి స్పోకేన్ నివాస ప్రాంతాలకు చేరుకున్నాయి. దాదాపు 4,000 భవనాలు ప్రమాదంలో ఉన్నట్లు అధికారుల అంచనా.

మరోవైపు మంటల కారణంగా ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో దాదాపు 60,000 మంది వినియోగదారులు విద్యుత్ సరఫరా లేక ఇబ్బంది పడుతున్నారు.

కొన్ని ఆసుపత్రులు, నీటి శుద్ధి కేంద్రాలు వంటి కీలక సేవలను కూడా ఆపేయాల్సి వచ్చిందంటే కార్చిచ్చు ఏ స్థాయిలో చెలరేగుతోందో అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -