25.7 C
Hyderabad
Monday, August 17, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ ‘మహేంద్రగిరి వారాహి’లో బ్రహ్మానందం సీరియస్ లుక్: ‘బ్రహ్మ’ గ్లింప్స్ వీడియో చూశారా!

‘మహేంద్రగిరి వారాహి’లో బ్రహ్మానందం సీరియస్ లుక్: ‘బ్రహ్మ’ గ్లింప్స్ వీడియో చూశారా!

- Advertisement -

హైద‌రాబాద్‌: హాస్య నటనతో దశాబ్దాలుగా నవ్వించిన లెజెండరీ నటుడు బ్రహ్మానందం, ఈసారి తన రొటీన్ కామిక్ ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన సీరియస్, భావోద్వేగ పాత్రలో కనిపించబోతున్నారు. సుమంత్ కథానాయకుడిగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’ (Mahendragiri Varahi) లో బ్రహ్మానందం ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర పేరు ‘బ్రహ్మ’.

ఆదివారం ఈ పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. సంప్రదాయ వస్త్రధారణలో ఎంతో తీవ్రమైన భక్తిప్రపత్తులు, ఆవేదనతో కనిపించిన బ్రహ్మానందం… “అమ్మా వారాహి, మా మహేంద్రగిరిని కాపాడు తల్లీ” అంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్న తీరు ప్రేక్షకాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హాస్యానికి ఏమాత్రం తావులేకుండా పూర్తిస్థాయి కంటెంట్ ఆధారిత, భావోద్వేగ పాత్రలో ఆయన కనిపించడం సినిమాపై అంచనాలను పెంచేసింది.

రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కాలిపు మధు, ఎం. సుబ్బారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. సుమంత్ సరసన మీనాక్షి గోస్వామి, ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్ కథానాయికలుగా నటిస్తున్నారు. మహేంద్రగిరి వారాహి అమ్మవారి ఆలయం నేపథ్యంతో కూడిన ఈ డివోషనల్-అడ్వెంచర్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -