25.7 C
Hyderabad
Monday, August 17, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ సెంటిమెంట్ విత్ యాక్షన్ మేళవింపు: రవితేజ ‘ఇరుముడి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల!

సెంటిమెంట్ విత్ యాక్షన్ మేళవింపు: రవితేజ ‘ఇరుముడి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల!

- Advertisement -

మాస్ మహారాజ రవితేజ, ప్రియా భవానీ శంకర్ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, యాక్షన్ డ్రామా చిత్రం ‘ఇరుముడి’ థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో ఘనంగా నిర్వహించి ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తూ భార్య (ప్రియా భవానీ శంకర్), కూతురే (బేబీ నక్షత్ర) ప్రాణంగా బతికే ఓ సాధారణ మధ్యతరగతి తండ్రి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తండ్రీకూతుళ్ల అనుబంధం, ఎమోషన్స్‌తో పాటు అయ్యప్ప మాలధారణ వెనుక ఉన్న ఆధ్యాత్మిక, ఆసక్తికరమైన కథాంశాన్ని అత్యంత భావోద్వేగభరితంగా చూపిస్తూనే… రవితేజ మార్క్ యాక్షన్, మాస్లిన్‌ సన్నివేశాలను ట్రైలర్‌లో బలంగా ప్రెసెంట్ చేశారు.

ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్‌కు మంచి స్పందన లభించగా, తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది.

 

- Advertisement -