- Advertisement -
న్యూఢిల్లీ: భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా తన వక్రబుద్ధిని చాటుకుంది. ఆ దేశానికి చెందిన 59 యాప్‌లను భారత్ నిషేధించడంతో ఉడికిపోతున్న డ్రాగన్ కంట్రీ.. భారత్‌కు చెందిన వెబ్‌సైట్లు, వార్తా పత్రికలను ప్రజలకు దూరం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
నిజానికి చైనాకు చెందిన వెబ్‌సైట్లు, వార్తా పత్రికలపై భారత్ నిషేధం విధించకున్నా చైనా మాత్రం ఈ పని చేస్తుండడం గమనార్హం. ఇందులో భాగంగా ఇకపై భారత మీడియాకు చెందిన వెబ్‌సైట్లను వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్) సర్వర్ ద్వారా మాత్రమే పనిచేసేలా నిబంధనలు మార్చినట్టు తెలుస్తోంది.
భారత టీవీ చానళ్లను మాత్రం ప్రస్తుతానికి ఐపీ టీవీ ద్వారా పొందే వెసులుబాటు ఉంది. చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించిన తర్వాత చైనాలో ఐఫోన్లు, డెస్క్‌టాప్‌లలో ఎక్స్‌ప్రెస్ వీపీఎన్ పనిచేయకపోవడం గమనార్హం.
- Advertisement -