షాకింగ్: స్నేహితుడి భార్య, మరదలిపై కన్నేసిన ప్రబుద్ధుడు, చివరికి…

6:30 pm, Mon, 15 April 19
man-killed-his-friend-for-his-sexual-harassment

బెంగళూరు: చిన్ననాటి స్నేహితుడు కదాని ఇంటికి పిలిస్తే.. ఆ ప్రబుద్ధుడు స్నేహితుడి భార్య, మరదలిపై కన్నేశాడు. కొంతకాలానికి ఈ విషయం తెలిసి స్నేహితుడు హెచ్చరించాడు. అయినా ఆ ప్రబుద్ధుడు వినలేదు, వేధింపులు మానలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా అతడి పీడ వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు వాళ్లు. ఇంటికి పిలిచి తలపై రాడ్డుతో మోది హతమార్చారు.

ఈ ఘటన బెంగళూరులోని లవకుశ నగర్‌లో శనివారం చోటుచేసుకోగా.. పోలీసులు దీనిపై హత్య కేసు నమోదు చేసి, ఈ ఘాతుకానికి పాల్పడిన భార్యాభర్తలను అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…

చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. మహిళా టెక్కీని చంపి.. శవాన్ని సూట్‌కేసులో కుక్కి…

కర్ణాటక రాష్ట్రంలోని హసన్ ప్రాంతం గోపనహళ్లికి చెందిన మోహన్, రమ్య చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం పెద్దయ్యాక కూడా కొనసాగడం, తరువాత ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతోనే వారు భార్యభర్తలయ్యారు.

పెళ్లయ్యాక మోహన్, రమ్య బెంగళూరులోని రాజగోపాల్ నగర్‌ ప్రాంతంలోని లవకుశ నగర్‌లో కాపురం పెట్టారు. మోహన్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

భార్య, మరదలిపై స్నేహితుడి కన్ను…

ఈ క్రమంలో అతనికి మధు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడూ డ్రైవర్‌గానే పనిచేస్తున్నాడు. ఆరా తీస్తే.. అతడు కూడా మోహన్‌కు చిన్నప్పుడు స్నేహితుడుగా తేలింది. దీంతో అనతికాలంలోనే వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. స్నేహితుడే కదా అనే భావనతో మధును తన ఇంటికి తీసుకెళ్లాడు మోహన్. ఈ నేపథ్యంలో మోహన్ భార్య రమ్యపై మధు కన్ను పడింది.

మోహన్ ఇంట్లో లేని సమయంలో తరచూ అతడి ఇంటికి మధు వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఒకరోజు మోహన్ భార్య రమ్యను బలవంతం చేయబోయాడు. తన మాట వినకుంటే, తనతో అక్రమ సంబంధం పెట్టుకోకపోతే ఆమె క్యారెక్టర్ గురించి మోహన్‌కు చెడుగా చెబుతానంటూ బెదిరించేవాడు.

చదవండి: కలప స్మగ్లింగ్ కింగ్.. తెలంగాణ వీరప్పన్ అరెస్ట్!

దీంతో తన భర్త ఆ ప్రబుద్ధుడి మాటలు నమ్మి ఎక్కడ తనను వదిలేస్తాడో అనే భయంతో రమ్య మూడు నెలలుగా అతని వేధింపులను మౌనంగా భరిస్తూ వచ్చింది. అయితే మధు అఘాయిత్యం అక్కడితో ఆగలేదు.. రమ్య చెల్లెలు బిందుపైన కూడా కన్నేసిన అతడు ఆమెను కూడా లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు.

దీంతో సహనం నశించిన రమ్య జరిగినదంతా తన భర్త మోహన్‌కు చెప్పేసింది. దీంతో మోహన్ కోపోద్రిక్తుడై స్నేహితుడైన మధును తన కుటుంబానికి దూరంగా ఉండాల్సిందిగా హెచ్చరించాడు. అయితే మోహన్ వార్నింగ్‌ను మధు లెక్కచేయలేదు. ఎప్పటిలాగే మోహన్ డ్యూటీకి వెళ్లిన సమయంలో వారి ఇంటికి వస్తూ రమ్య, బిందులను లొంగదీసుకునే ప్రయత్నాలు సాగించేవాడు.

ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని…

దీంతో ఇక లాభం లేదని, ఎలాగైనా మధు అడ్డు తొలగించుకోవాలని మోహన్ భావించాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. తన భార్య రమ్యతో మధుకు ఫోన్ చేయించి.. అతడు తమ ఇంటికి వచ్చేలా చూసుకున్నాడు. మధు ఇంటికి రాగానే అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న ఇనుపరాడ్‌తో అతడి తలపై కొట్టాల్సిందిగా భార్య రమ్యకు సూచించాడు.

చదవండి: కోదాడలో పండగపూట ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

రమ్య భర్త చెప్పినట్లుగా మధు తలపై ఇనుప రాడ్‌తో బలంగా మోదింది. దీంతో తలపై తీవ్ర గాయం అయిన మధు అక్కడికక్కడే కుప్పకూలిపోయి రక్తస్రావంతో ప్రాణాలు కొల్పోయాడు. స్థానికులు వచ్చి చూసేసరికి మధు రక్తపు మడుగులో పడి కనిపించాడు.

దీంతో వారు రాజగోపాల్ నగర్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు హత్య కేసు నమోదు చేసుకుని భార్యాభర్తలైన నిందితులైన రమ్య, మోహన్‌‌లను అరెస్ట్ చేశారు.

చదవండి: పెళ్లైన ఏడాదికే.. 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న టెక్కీ!