2 కోట్ల ఆఫర్ ను వద్దన్న సాయి పల్లవి!

sai pallavi

హైదరాబాద్: తోటి నటీనటుల కంటే తాను డిఫరెంట్ అని సాయిపల్లవి మరోసారి నిరూపించుకుంది. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సాయి పల్లవి ఇప్పటి వరకు ఒక్క వాణిజ్య ప్రకటనలో కూడా కనిపించలేదు.

తాజాగా ఆమె ఒక భారీ డీల్ ను తిరస్కరించింది. తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసడర్ గా ఉండమని ఓ ప్రముఖ ఫేస్ క్రీమ్ సంస్థ సాయి పల్లవిని సంప్రదించింది. రూ. 2 కోట్ల పారితోషికం ఇస్తామని ఆఫర్ చేసింది.

అయినా, ఆ ఆఫర్ ను ఆమె సున్నితంగా తిరస్కరించింది. సినిమాల్లో కూడా తాను మేకప్ వేసుకోకుండా నటిస్తున్నానని… అలాంటిది ఫేస్ క్రీమ్ వాడమని జనాలను తాను ఎలా ప్రోత్సహిస్తానని ఆమె చెప్పింది. దీంతో, మేకప్ లేకుండానే తమ ప్రకటనలో నటించమని సదరు సంస్థ ఆమెను కోరినా… ఆఫర్ ను తిరస్కరించింది.