25.7 C
Hyderabad
Monday, August 17, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ ‘ఎన్టీఆర్’ భుజానికి శస్త్రచికిత్స: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్!

‘ఎన్టీఆర్’ భుజానికి శస్త్రచికిత్స: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్!

- Advertisement -

హైద‌రాబాద్‌: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి హైదరాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్స పూర్తి చేశారు. సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో, వైద్యుల పర్యవేక్షణ పూర్తి చేసుకుని ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ వార్త తెలిసి అభిమానులు ఆందోళన చెందుతుండటంతో ఎన్టీఆర్ పిఆర్ టీమ్ ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తూ పూర్తి వివరాలను వెల్లడించింది.

కొద్దిరోజుల క్రితం జిమ్‌లో తీవ్రమైన వర్కౌట్‌లు చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ కుడి భుజానికి గాయమైంది. మైగ్రేన్ తరహాలోనే భుజం నొప్పి వేధిస్తుండటంతో వైద్యులను సంప్రదించగా… చిన్నపాటి ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్ (శస్త్రచికిత్స) అవసరమని సూచించారు. దీంతో నిపుణులైన డాక్టర్ల బృందం ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. శస్త్రచికిత్స అనంతరం తారక్ పూర్తిగా కోలుకోవడానికి, తిరిగి మునుపటిలా యాక్షన్ సీన్లలో పాల్గొనడానికి సుమారు 2 నుంచి 3 నెలల పాటు విశ్రాంతి (Bed Rest & Physiotherapy) అవసరమని వైద్యులు సూచించారు.

“శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఎన్టీఆర్ గారు ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అభిమానులెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. వైద్యుల సలహా మేరకు కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆయన తిరిగి కెమెరా ముందుకు వస్తారు” అని ఎన్టీఆర్ టీమ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆయన కన్నడ దిగ్గజ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘డ్రాగన్’ (DRAGON) షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ విరామం ముగిసిన వెంటనే డ్రాగన్ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.

- Advertisement -