షాకింగ్: హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఘోరం! ‌బర్త్‌డే పార్టీకి పిలిచి.. కారులోనే..

- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరం నడిబొడ్డున మరో దురాగతం చోటు చేసుకుంది. జుబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన స్మృతిపథం నుంచి తొలగిపోకమునుపే.. నెక్లెస్ రోడ్డులో మరో ఘోరం జరిగిపోయింది.

ఓ మైనర్ బాలికను బర్త్‌డే పార్టీకి పిలిచి కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు సురేష్ అనే ఓ ప్రబుద్ధుడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన రాంగోపాల్ పేట పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

జుబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటన కలకలం ఇంకా సద్దుమణగక మునుపే నగరం నడిబొడ్డున మరో అత్యాచార ఘటన వెలుగుచూడడం అందరినీ భయాందోళనలకు గురిచేస్తోంది.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -