షాకింగ్: హైదరాబాద్‌లో పెరిగిపోతున్న హత్యలు.. నడిరోడ్డుపైనే అతి కిరాతకంగా…

mother-in-law-killed-6-years-old-girl-brutally-and-drink-her-blood
- Advertisement -

hyderabad-murder

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో శాంతి భద్రతలు అదుపు తప్పాయా? పోలీసులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడ్డారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. ఇటీవలి కాలంలో పరువు హత్యలు పెరిగిపోయాయని ఒకవైపు బాధపడుతుంటే.. మరోవైపు.. చిన్న చిన్న కారణాలకే గొడవ పడటం.. అవి పరస్పరం చంపుకునే వరకు దారితీస్తుండడం మరింత బాధ కలిగిస్తోంది.

చదవండి: దారుణం: ఫైనాన్స్ వ్యాపారిపై పెట్రోల్ పోసి.. నిప్పంటించిన దుండగులు, ఎక్కడంటే….

అత్తాపూర్ ఘటనను మరిచిపోకమునుపే.. హైదరాబాద్‌లో 24 గంటల వ్యవధిలో మరో రెండు హత్యలు చోటుచేసుకున్నాయి. బుధవారం రాత్రి పాతబస్తీలో ఓ ఆటో డ్రైవర్‌ను.. మరో ఆటో డ్రైవర్ మాసం కొట్టే కత్తితో నడిరోడ్డుపై నరికి చంపాడు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ ఘోరాన్ని అడ్డుకోవడానికి విఫలయత్నం చేశాడు. అయినా ప్రయోజనం లేకపోయింది.

అత్తాపూర్ ఘటన మాదిరిగానే జరుగుతున్న ఘోరాన్ని ఆ ప్రాంతంలో రాకపోకలు సాగిస్తున్న వారు చోద్యం చూశారే తప్ప మృతుడ్ని రక్షించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. పైగా ఈ హత్యోదంతాన్ని కొంతమంది తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించడంలో బీజీగా ఉండిపోయారు. ఆ మర్నాడే.. అంటే గురువారం ఉదయం నగర శివారలోని బీఎన్ రెడ్డి నగర్‌లో మరో హత్యోదంతం చోటుచేసుకుంది.

hyd-nayapool-murderనయాపూల్‌లో దారుణం…

హైదరాబాద్‌లో మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నయాపూల్‌లో.. స్థానిక ఐసీఐసీఐ బ్యాంక్ సమీపంలో బుధవారం రాత్రి 7.15 గంటల ప్రాంతంలో నడిరోడ్డుపై ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కత్తితో నరికి చంపడం స్థానికంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. పోలీసుల కథనం ప్రకారం.. చంచల్‌గూడకు చెందిన అబ్దుల్ ఖాజా (29) అనే ఆటో డ్రైవర్.. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే ప్రాంతానికి చెందిన షకీర్ ఖురేషీ (30) అనే మరో ఆటో డ్రైవర్‌ను అత్యంత దారుణంగా హత్య చేశాడు.

స్వయంగా ఆటో డ్రైవర్ అయిన అబ్దుల్ ఖాజా.. ఇతరులకు ఆటోలను అద్దెకు ఇస్తూ కూడా సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో షకీర్ ఖురేషీ సమీప బంధువు ఒకరికి ఆటోను అద్దెకు ఇచ్చాడు. ఈ విషయంలో తొలుత అబ్దుల్ ఖాజా, షకీర్ ఖురేషీల నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. ఖురేషీ దుర్భాషలాడుతూ.. ఖాజాను, అతడి కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు.

చదవండి: షాకింగ్: ప్రియుడ్ని చంపి.. కూర వండి.. కూలీలకు వడ్డించిన యువతి!

దీంతో ఆగ్రహం పట్టలేక అబ్దుల్ ఖాజా అతడిపై కలబడ్డాడని, ఈ క్రమంలో ఖురేషీ వద్ద ఉన్న కత్తిని లాక్కున్న ఖాజా అదే కత్తితో ఖురేషీ దాడి చేసి, అతడి మెడపై నరికాడు. కత్తిపోట్లకు గురైన ఖురేషీ రక్తపు మడుగులో కుప్పకూలిపోగా, అక్కడే కూర్చున్న ఖాజా కాసేపు విరామం ఇచ్చి మళ్లీ అదే కత్తితో ఖురేషీని నరికి చంపాడు.

అంతేకాదు, హత్య చేసిన తరువాత అబ్దుల్ ఖాజా.. ఖురేషీ మృతదేహం పక్కనే కూర్చుని.. తాను చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని, తనను ఉరి తీసినా పర్వేలేదంటూ గట్టిగా అరిచాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నజీముద్దీన్ ఈ దురాగతాన్ని అడ్డుకునేందుకు.. తన చేతిలోని వైర్‌లెస్ సెట్‌తో అబ్దుల్ ఖాజాను కొట్టినా ఫలితం లేకపోయింది. మరోవైపు చుట్టూ మూగిన జనం చోద్యం చూశారే తప్ప ఎవరూ షకీర్‌ను కాపాడే ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు తమ సెల్‌ఫోన్లలో ఆ దృశ్యాలను చిత్రీకరించడంలో వారు మునిగిపోయారు.

దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ నజీముద్దీన్ సమీపంలోని పోలీస్ స్టేషన్లకు ఆ సమాచారం చేరవేశాడు. మీర్‌చౌక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్లూస్ టీమ్‌తో పరిశీలించి కొన్ని ఆధారాలు సేకరించారు. అనంతరం షకీర్ ఖురేషీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే అబ్దుల్ ఖాజా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

hyd-bn-reddy-nagar-murderబీఎన్ రెడ్డి నగర్‌లో పట్టపగలు…

నగర శివారులోని బీఎన్ రెడ్డి నగర్‌లో గురువారం ఉదయం నడిరోడ్డుపై ఓ వ్యక్తిని వేటకొడవలితో నరికి చంపేశారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ దారుణం చోటుచేసుకోవడం గమనార్హం. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆ వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మృతుడ్ని నాగర్‌ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తిమ్మరాసిపల్లికి చెందిన శ్రీనివాస్ గౌడ్‌గా గుర్తించారు. మృతుడు, హంతకుడు ఒకే కారులో వచ్చారని.. బయటకు దిగాక ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ వెంటనే శ్రీనివాస్ గౌడ్‌ను వేటకొడవలితో దారుణంగా హత్య చేశాడని స్థానికులు చెబుతున్నారు. ఇద్దరి మధ్య పాత గొడవలు ఉన్నాయని, ఆ కోపంతోనే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

చదవండి: షాకింగ్: ప్రతి హత్యకు ముందు కాళీమాతకు పూజ.. ఓ సీరియల్ కిల్లర్ ‘సెంటిమెంట్’!

- Advertisement -