సినిమాల్లో అవకాశాలు లేక డ్యాన్సర్ల పాడు పని, ఏం చేశారంటే..

dancers-prostitution
- Advertisement -

dancers-prostitution

హైదరాబాద్: వెండితెరపై ఓ వెలుగు వెలగాలన్న తపనతో సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్న ఎంతోమంది యువతులు ఆ కోరిక తీరక, బతుకుదెరువు లేక చీకటి వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు.  కొంతమంది ఒకటి రెండు సినిమాలలో నటించి ఆనక అవకాశాలు దొరకక.. అప్పటికే మారిన మారిన లైఫ్‌స్టైల్‌‌తో విలాస జీవితానికి అలవాటు పడి డబ్బు కోసం బ్రోకర్ల చేతుల్లో పావులుగా మారి అడ్డంగా బుక్కవుతున్నారు.

టాలీవుడ్, బాలీవుడ్, భోజ్‌పురి సినీ రంగాలకు చెందిన కొంతమంది తారలు ప్రముఖ హోటళ్లలో అనైతిక కార్యకలాపాలు చేస్తూ గతంలో పోలీసులకు దొరికిపోయారు. ఇలాంటి ఘటనలు.. సినీతారల చీకటి జీవితాలను వెలుగులోనికి తీసుకొస్తున్నాయి.  తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

స్టార్‌ హోటల్‌లో…

స్టార్‌ హోటల్‌లో వ్యభిచారం చేసేందుకు యత్నించిన ఇద్దరు డ్యాన్సర్లు, మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌కు చెందిన ఎంబీఏ విద్యార్థి ఇబ్రహీం ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇద్దరు యువతులతో కలిసి రోడ్డు నెంబరు 2లోగల పార్క్‌ హయత్‌ హోటల్‌కు వెళ్లాడు. అప్పటికే సల్మాన్‌ అనే వ్యక్తి వారి కోసం ఆ హోటల్‌‌లో గది బుక్‌ చేశాడు. ఇబ్రహీం యువతులతో కలిసి తన గది తాళం కోసం హోటల్  రిసెప్షన్‌ వద్దకు వెళ్లాడు.

ఆ యువతులు తన కుటుంబ సభ్యులని ఇబ్రహీం చెప్పగా.. రిసెప్షన్ సిబ్బందికి అనుమానం వచ్చి వారి ఐడెంటిటీ అడిగారు. ఆ  యువతులు అడ్డదిడ్డంగా సమాధానం ఇవ్వడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హోటల్‌కు వెళ్లి ఇబ్రహీంతోపాటు ఆ యువతులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో.. తనకు సల్మాన్‌ అనే వ్యభిచార గృహ నిర్వాహకుడు ఆ ఇద్దరు  యువతులను రోడ్డు నెంబరు 12లో అప్పగించాడని, తామంతా కారులో హోటల్‌కు చేరుకున్నామని ఇబ్రహీం తెలిపాడు.  ఇందుకోసం సల్మాన్‌కు తాను రూ. 11 వేలు కూడా ఇచ్చినట్టు చెప్పాడు. ఆ యువతుల్లో ఒకరిని హైదరాబాద్‌‌, మరొకరిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన డ్యాన్సర్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న సల్మాన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -