26.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఎయిర్‌టెల్ నుంచి బంపర్ ఆఫర్: రూ.75కే 1జీబీ డేటా, కాలింగ్‌, ఎస్సెమ్మెస్‌లు

ఎయిర్‌టెల్ నుంచి బంపర్ ఆఫర్: రూ.75కే 1జీబీ డేటా, కాలింగ్‌, ఎస్సెమ్మెస్‌లు

bharti-airtel
- Advertisement -

bharti-airtelముంబై: టెలికాం దిగ్గజ సంస్థ ఎయిర్‌టెల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.  వాయిస్ కాల్స్ ఎక్కువగా చేసుకునే వారి కోసం 168 రోజుల వాలిడిటీతో రూ.597 ప్రీపెయిడ్ ప్లాన్‌ను నిన్ననే అందుబాటులోకి తీసుకొచ్చిన ఎయిర్‌టెల్ ఆ వెంటనే  మరో సరికొత్త ఎంట్రీ-లెవల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ఆవిష్కరించింది.

బేసిక్‌ లెవల్‌ యూజర్ల కోసం రూ.75 ప్లాన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్‌ లాంచ్‌ చేసిన ఈ ఎంట్రీ-లెవల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ కింద యూజర్లకు 28 రోజుల పాటు 300 నిమిషాల ఉచిత కాల్స్‌, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, 1 జీబీ 2జీ/3జీ/4జీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు ప్రకటించింది. వాయిస్‌ కాల్స్‌లో లోకల్‌, ఎస్టీడీ, అవుట్‌ గోయింగ్‌ రోమింగ్‌ వాయిస్‌ కాల్స్‌ ఉన్నాయి. అయితే అంతకుముందే ఎయిర్‌టెల్‌ రూ.47తో ఓ ప్లాన్‌ను కూడా తీసుకొచ్చింది. దాని వాలిడిటీ కూడా 28 రోజులే.

ఇప్పటికే ఎయిర్‌టెల్‌ ప్రత్యర్థి ఐడియా సెల్యులార్‌ కూడా రూ.75 ప్లాన్‌ను కలిగి ఉంది. ఐడియా కూడా తన ప్లాన్‌పై 300 నిమిషాల కాలింగ్‌, 1జీబీ 4జీ డేటా, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లనే ఆఫర్‌ చేస్తోంది. అయితే ఐడియా కేవలం ఈ ప్లాన్‌ను తన 4జీ సర్కిల్‌ వినియోగదారులకే అందిస్తోంది.

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా రూ.75 ప్లాన్‌ ఆఫర్‌ చేస్తోంది. అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌ వాలిడిటీ 15 రోజులే. పైగా ఎలాంటి ఎఫ్‌యూపీ పరిమితులు లేకుండా అపరిమిత కాలింగ్‌ ప్రయోజనాలను అందిస్తోంది. అంతేకాదు, బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు ఈ ప్లాన్‌ కింద 10 జీబీ 3జీ డేటా, 500 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు అందుతున్నాయి.

- Advertisement -