‘హ్యాపి వెడ్డింగ్‌’ మూవీ రివ్యూ

Happy Wedding
- Advertisement -

Happy-Wedding-Review-1

మీకు గుర్తుందో లేదో.. ఎనిమిదేళ్ల క్రితం మరాఠీలో  Mumbai-Pune-Mumbai అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. దాన్ని తెలుగులో ‘మేడ్ ఇన్ వైజాగ్’గా రీమేక్ చేశారు. ఆ తర్వాత మరాఠీ సినిమాకు సీక్వెల్ Mumbai-Pune-Mumbai 2 వచ్చింది. మొదట సినిమా చూసిన జనం దీన్ని హిట్ చేసేశారు. తెలుగు సినిమా అని రివ్యూ మొదలెట్టి.. మధ్యలో మరాఠీ మ్యాటర్ ఎందుకూ అంటారా?.. ఈ సినిమా ఈ సీక్వెల్ సినిమాకు అఫీషియల్ అవునో కాదో కానీ రీమేక్ అన్నది మాత్రం రాజీలేని  నిజం. ఇంతకీ ఆ మరాఠీ కథని తెలుగులో అందించాలన్న ఆలోచన వచ్చేటంత గొప్ప కథ సినిమాలో ఏముంది? సినిమా మనవాళ్లకు నచ్చే అవకాశం ఉందా? ఈ విషయాలన్నీ రివ్యూలో చూద్దాం…

స్టోరీ లైన్ ఇదే…

ఆనంద్‌(సుమంత్‌ అశ్విన్‌) అనే విజయవాడ కుర్రాడు(విజయవాడ అని ప్రత్యేకంగా ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చిందంటే ..సినిమా డైలాగుల్లో సగం విజయవాడ అంటూ మొదలవుతాయి కాబట్టి)…అప్పుడెప్పుడో అంటే సినిమా ప్రారంభానికి ముందే అక్షర(నిహారిక) తో ప్రేమలో పడి..దాన్ని పెళ్ళి దాకా తెస్తాడు. ఎంగేజ్మెంట్ కానిచ్చేస్తాడు.

దాంతో రెండు ఫ్యామిలీలు ఫుల్  హ్యాపీ.. ఆ నేపధ్యంలో సల్మాన్ ఖాన్ ప్రేమాలయం టైప్ … హారమణి పెట్టె, మద్దెళ్లలతో పాటలు గట్రా పాడేసుకుని తమ కుటుంబాల్లో ఉన్న ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటారు.  అంతా బాగానే ఉంది..ఒక కుటుంబ పాటలు కూడా మరొక కుటుంబానికి నచ్చాయి… అని అంతా  మురిసిపోతున్న సమయంలో ఓ మలుపు.

ఓ రోజు ఆనంద్ ని కలవటానికి  విజయవాడ వచ్చిన  అక్షర..అతను రిసీవ్ చేసుకోవటానికి లేటుగా రావటంతో  అసహనం వస్తుంది. అది కోపం గా మారుతుంది. ఆ తర్వాత…తనతో ప్రేమలో ఉన్నప్పుడు చాలా కన్సర్న్ గా ఉండేవాడు…ఇప్పుడు పెళ్లి కుదిరింది అనగానే… కట్ చేసినట్లుగా ప్రక్కన పెట్టేస్తున్నాడు..ఇక నా జీవితం ఇంతేనా…పెళ్లయ్యాక ఇంకా దారుణంగా మారిపోయి…అసలు తనను పట్టించుకోవటమే మానేస్తాడా వంటి రకరకాల అనుమానాలు ఆమె మనస్సులో వరదలా వచ్చేస్తాయి.

Happy-Wedding2ఆ వరద నీటికి  ఉక్కిరిబిక్కిరి అయిన ఆమె అతన్ని మన పెళ్లి పెండింగ్ లో పెడుతున్నా…కొద్దిగా టైమ్ తీసుకుని నిన్న పెళ్లి చేసుకోవాలా వద్దా చెప్తా అని అల్టిమేటం ఇచ్చేస్తుంది. దీనికి తోడు అక్షర ..ఎక్స్ బోయ్ ఫ్రెండ్ ఒకడు …సీన్ లోకి వస్తాడు. ఆనంద్ పరిస్దితి ఇప్పుడు సునామీ లో సోమాలియాకు కొట్టుకుపోయినవాడిలా మారిపోతుంది. వెనక్కి వెళ్లలేడు..ముందుకు వెళ్లలేడు.

అయితే ఈ వరదలు, సునామీలు తెలియని రెండు కుటుంబాలు వాళ్లు … పెళ్లి పనుల్లో బిజీ అయ్యిపోతారు. మరి ఈ సమయంలో ఆనంద్ ఏం చేసాడు. అక్షర ఫైనల్ గా ఏం నిర్ణయం తీసుకుంది. చివరకు హ్యాపీ వెడ్డింగ్ అనే టైటిల్ కు జస్టిఫికేషన్ జరిగిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది…

సినిమా స్టోరీ లైన్ గా చెప్పుకోవటానికి బాగానే ఉన్నా… టోటల్ గా తెరపై చూసేసరికి …అవే సీన్స్ రిపీట్ అవుతున్నట్లు..ఒక్కో సీన్ రియల్ టైమ్ లో ఒక్కో గంట జరుగుతున్నట్లు అనిపించింది. అందుకు కారణం..దర్శకుడు స్లో నేరేషన్ కు తోడు…ఒకే కాంప్లిక్ట్ ని సబ్ ప్లాట్స్ లేకుండా సాగతీయటమే. దానికి తోడు కాంప్లిక్ట్ కూడా బలంగా అనిపించదు. వేరే ఇంపార్టెంట్ పనివల్ల లేటైంది సారీ ..అని చెప్పినా ఆ ఒక్క సంఘటనే పట్టుకుని తనకు తోచినవి ఊహించని, సీన్స్ వేసేసుకునే నీహారిక క్యారక్టర్ సమంజసంగా అనిపించదు.

అలాగే…హీరో,హీరోయిన్స్ లవ్ స్టోరీ ని సినిమా కథ ప్రారంభానికి ముందే జరిగిందని డైలాగుల్లో చెప్పకుండా కాస్త …విజువల్ గా చూపెడుతూ ఎస్టాబ్లిష్ చేస్తే..అఫ్పుట్లో ఎంత కన్సర్న్ గా ఉండేవాడు..ఇప్పుడు ఎలా ఉన్నాడు అనే విషయం క్లియర్ గా అర్దమయ్యేది. స్క్రీన్ మీద కూడా ఒకే పాయింట్ రన్ అవుతున్నట్లుగా అనిపించకపోను..కాస్త వేరియేషన్ కనపడేది.

Happy-Wedding-Movie-Stillమెచ్చుకోవాల్సిన మ్యాటరే కానీ…

చిన్న సినిమాలు, యూత్ సినిమాలు అంటే బూతును ఆశ్రయిస్తున్న ఈ రోజుల్లో ఒక చిన్న ఫీల్ గుడ్ స్టొరీలైన్ ను బేస్ చేసుకుని కొత్త దర్శకుడు చేసిన ప్రయత్నం మెచ్చుకోదగినదే కానీ మేకింగ్ లో స్పీడులేకపోవటం…కథలో బలమైన కంటెంట్ లేకపోవటంతో …ఈ సినిమా షార్ట్ ఫిలింకు ఫీచర్ ఫిలింకు మధ్యన ఉండిపోయిన ఫీల్ వచ్చింది.

తాగుడు గోలేంటో…

విజయవాడ,హైదరాబాద్ లలో …అమ్మాయిలు,అబ్బాయిలు తాగుతున్నట్లు…దాన్ని ఇంట్లో వాళ్లు చాలా ఆనందంగా ఏక్సెప్టు చేసినట్లు చూపించారు. అక్కడక్కడా తాగేవాళ్లు అదీ హై సర్కిల్స్ లో ఉన్నా …దాన్ని అంత హైలెట్ చేసి చూపించక్కర్లేదేమో…

అన్నపూర్ణమ్మ కు ద్వంద్వార్దాలేంటో…

సీనియర్ నటి..ఈ సినిమాలో హీరోకు నాయనమ్మ గా చేసిన అన్నపూర్ణమ్మ చేత ద్వంద్వార్దాలు పలికించాలన్న దర్శకుడి మోడ్రన్ థాట్ కు సలాం.

టెక్నికల్ గా ఎలా ఉందంటే…

మరాఠి స్టోరీ లైన్ తీసుకున్నా..అది సీక్వెల్ అనే విషయం మర్చిపోకుండా..మన నేటివికి తగ్గట్లుగా…క్యారక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ కథ చెప్పాల్సింది. అలా చేయకపోవటంతో మిగతా డిపార్టమెంట్స్ ఎంత వర్క్ చేసినా హైలెట్ కాలేదు. అలాగే ఫిదా కు సంగీతం ఇచ్చిన  శక్తికాంత్ కార్తీక్ సమకూర్చున పాటలు జస్ట్ ఓకే అన్నట్లున్నాయి. సినిమాలో హైలెట్ ..సినిమాటోగ్రఫీ. చాలా  రియలిస్టిక్ పెళ్లి వాతావరణంని అందంగా చిత్రీకరించారు.

ఎడిటర్ గారు కాస్త సాగతీత తగ్గించి..స్పీడ్ పెంచి ఉంటే ఉంటే చూసేవాళ్లకు..సెల్ ఫోన్స్ చూసుకుంటూ కూర్చోవల్సిన అవసరం తప్పేది.  పెద్ద బ్యానర్ కు తగ్గట్లే నిర్మాణ విలువలు ఉన్నాయి. మెగాడాటర్ నీహారిక, సుమంత్ అశ్విన్ ఇద్దరూ సెటిల్డ్ గా తమ పాత్రలు చేసుకుంటూ పోయారు. మురళీ శర్మ, నరేష్ సినిమాకు పిల్లర్స్ గా నిలిచారు.  డైలాగులు బాగానే ట్రై చేసారు కానీ ప్లాట్ వీక్ కావటంతో అవీ అంతలా రాణించలేకపోయాయి.

Happy Weddingఫైనల్ ధాట్…

క్లీన్ సినిమా అంటే అర్దం ..సినిమాలో ఏమీ లేకుండా క్లీన్ గా ఉండటం అని కూడా అర్దం  చేసుకోవచ్చు.

రేటింగ్ : 2

ఎవరెవరు…

నటీనటులు: సుమంత్‌ అశ్విన్‌, నిహారిక కొణిదెల, మురళీ శర్మ, నరేష్‌, పవిత్ర లోకేష్‌, తులసి, ఇంద్రజ, అన్నపూర్ణ తదితరులు
సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్‌
నేపథ్య సంగీతం: తమన్‌
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీమణి
ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి
ఎడిటింగ్‌: కె.వి. కృష్ణారెడ్డి
నిర్మాత: ఎం. సుమంత్‌ రాజు
రచన-దర్శకత్వం: లక్ష్మణ్‌
సంస్థ: పాకెట్‌ సినిమా, యూవీ క్రియేషన్స్‌
విడుదల తేదీ: 28-07-2018

josyula surya prakash

– సూర్యప్రకాష్ జోశ్యుల

- Advertisement -