టీటీవీ దినకరన్ ఇంటిపై పెట్రో బాంబు దాడి యత్నం!

dinakaran
- Advertisement -

dinakaranచెన్నై: మాజీ ఏఐఏడీఎంకే నేత, ప్రస్తుత అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం పార్టీ అధినేత, ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ఇంటిపై ఆదివారం పెట్రో బాంబు దాడికి ప్రయత్నం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడగా, ఓ కారు ధ్వంసమైంది. ఆ సమయంలో దినకరన్ ఇంట్లో లేరు.

ఇటీవల అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం పార్టీ నుంచి బుల్లెట్‌ పరిమళం అనే వ్యక్తిని తొలగించారు. దీంతో దినకరన్‌పై పగ పెంచుకున్న పరిమళం ఆయన ఇంటిపై పెట్రోల్‌ బాంబు విసిరాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం బాంబును కారులో తీసుకుని దినకరన్‌ ఇంటి సమీపానికి చేరుకున్నాడు.

అయితే అనూహ్యంగా పెట్రోల్‌ బాంబు అదే కారులో పేలింది. ఈ ఘటనలో కారులోని ముగ్గురు వ్యక్తులతో పాటు సమీపంలో ఉన్న ఓ ఆటో డ్రైవర్‌  కూడా తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి బుల్లెట్‌ పరిమళాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


 

- Advertisement -