నాని ‘గ్యాంగ్ లీడర్’ మూవీ రివ్యూ.. మళ్లీ హిట్టేనట!

- Advertisement -

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి సూపర్ హిట్ ఇచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నేచురల్ స్టార్ నాని. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం (సెప్టెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మంచి అంచనాలతో ఈ మూవీ విడుదలైంది. ‘మనం’ తర్వాత మంచి హిట్ లేని విక్రమ్ కుమార్ ఈ మూవీ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడట. ఈ మూవీని చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

హీరో నాని నటన, దర్శకుడి పనితనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఫస్ట్ హాఫ్ టూ గుడ్.. సెకండ్ హాఫ్ బ్రిలియంట్’ అని పేర్కొంటున్నారు. సినిమా కొంచెం మెల్లగా మొదలైనా ఆ తర్వాత ఊపందుకుంది.

అక్కడక్కడా వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి, కట్టిపడేస్తాయి. ఇక, కమెడియన్ వెన్నెల కిషోర్ నటన ఈ సినిమాలో హైలెట్‌. ఇంటర్వెల్‌ వరకు సరదాగా సాగిన ఈ మూవీ.. ఓ ట్విస్ట్‌తో ఆడియన్స్‌లో మరింత ఆసక్తి కలిగించింది.

ఇంటర్వెల్ తర్వాత కథ సీరియస్‌గా మారిపోయి ఉత్కంఠ రేపుతోందని, స్క్రీన్ ప్లే‌తో ప్రీ క్లైమాక్స్ వరకు ఆడియన్స్ సినిమాతో ఎమోషనల్‌గా సాగేలా చేయడంలో దర్శకుడు విక్రమ్ ఫార్ములా విజయవంతం అయ్యిందంటున్నారు.

ఇక క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. గుండెలను హత్తుకునేలా ఉంది. క్లైమాక్సే ఈ సినిమాకు హైలెట్‌. నాని తన యాక్టింగ్‌తో మరోసారి ఆకట్టుకోగా, హీరోయిన్ ప్రియాంక, ఇతర నటీనటులు తమ పాత్రలకు పరిధిమేరకు న్యాయం చేశారు.

వెన్నెల కిషోర్ కామెడీ నవ్వించడంతో పాటు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుందని, రొమాన్స్ సినిమాలతో అదరగొట్టిన కార్తికేయ నెగిటివ్ రోల్‌లో తన నటనతో ఆకట్టుకున్నాడు.

మొత్తానికి కథ, కథనాలతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని ప్రీమియర్ షో చూసిన ప్రేక్షకులు పేర్కొన్నారు. ఎక్కడా ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమాను తెరకెక్కించాడు.

విక్రమ్ చిత్రాలన్నింటిలో ఇదే అత్యంత సులభమైన చిత్రమని అంటున్నారు. ఫస్టాఫ్ మొత్తం కామెడీతో నడిపించాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా డీసెంట్‌గా నడిచింది. సినిమాను చూసిన ప్రేక్షకులు కొందరు 5 పాయింట్లకు గాను 3.5 పాయింట్లు ఇస్తూ సూపర్ హిట్ అంటున్నారు.

- Advertisement -