ఖాతాదారులకు అలర్ట్.. వారం వ్యవధిలో.. 5 రోజులు బ్యాంకింగ్ సేవలు బంద్!

- Advertisement -

ముంబై: బ్యాంకు ఖాతాదారులూ బహుపరాక్! ఎందుకంటే, వారం రోజుల వ్యవధిలో 5 రోజులు బ్యాంకింగ్ సేవలు బంద్ కానున్నాయి. ఇటు పండుగలు, అటు ఉద్యోగ సంఘాల సమ్మె.. వెరసి ఆ రోజుల్లో.. బ్యాంకులు పూర్తిగా మూతపడనున్నాయి.

మార్చి 11న శివరాత్రి సందర్భంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. మార్చి 13, 14 తేదీల్లో (రెండో శనివారం, ఆదివారం) కూడా సెలవులే. 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, సాధారణ బీమా సంస్థను ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మార్చి 15, 16 తేదీల్లో…

ఈ నేపథ్యంలో బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తొమ్మిది ప్రధాన బ్యాంకు ఉద్యోగుల సంఘాలు దేశ వ్యాప్తంగా మార్చి 15, 16 తేదీల్లో అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చాయి. 

ఆ రెండు రోజుల్లో కూడా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగవచ్చంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల స్టాక్ ఎక్స్ఛేంజీలకు సైతం సమాచారం అందజేసింది. 

అంటే వచ్చే వారం రోజుల్లో కేవలం మార్చి 12, మార్చి 17న మాత్రమే బ్యాంకింగ్ కార్యకలాపాలు సాగుతాయి.  ఇలా మొత్తం మీద 5 రోెజులపాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది. 

కాబట్టి బ్యాంకు ఖాతాదారులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని లావాదేవీలు, ఇతరత్రా పనుల కోసం ముందుగానే జాగ్రత్త పడడం మంచిది. 

Also Read: 24 గంటల్లో 1,710 కరోనా కేసులు.. నాగ్‌పూర్‌లో మళ్లీ వారం రోజులు లాక్‌డౌన్!

 

- Advertisement -