బీజేపీ నేత ఖుష్బూ ఆస్తుల విలువ రూ. 4.55 కోట్లు.. ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడి

- Advertisement -

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ సినీ నటి ఖుష్బూ వద్ద 8.55 కిలోల బంగారు నగలున్నాయి. ఎన్నికల అఫిడవిట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ నగల విలువ రూ.3.42 కోట్లు ఉంటుందని తెలిపారు. తన ఖాతాలో రూ2.15 లక్షల నగదు ఉందని, సుమారు రూ.40 లక్షల విలువ చేసే రెండు లగ్జరీ కార్లు ఉన్నాయన్నారు.

తన పేరిట రూ.4.55 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ఖుష్బూ ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. గురువారం చెన్నై థౌజెండ్ ‌లైట్స్‌ నియోజకవర్గంలో ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు.

 

- Advertisement -