ప్రేమోన్మాదం: ప్రియురాలి తల నరికి.. దాంతో నేరుగా పోలీస్‌స్టేషన్‌కు…

Karnataka Marder
- Advertisement -

Karnataka Marderబెంగుళూరు: తన ప్రియురాలు మరో వ్యక్తితో చనువుగా ఉంటోందన్న కోపంతో ఓ యువకుడు ఉన్మాదిగా మారి, ప్రియురాలి గొంతు నరికి కిరాతకంగా హత్య చేశాడు. .  ఈ దారుణం కర్ణాటకలోని కంచర్లపల్లిలో జరిగింది.

వివరాల్లోకి వెళ్ళితే… శ్రీనివాసపురం పట్టణం గఫార్‌ఖాన్‌ వీధికి చెందిన అజిత్ ఖాన్ అలియాస్ సద్దాం(27) మొబైల్‌ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అజిత్‌కి ముందే పెళ్ళయింది. అయితే నీలసంద్రకు చెందిన రోషన్ ఖానుమ్(25) అనే యువతితో సన్నిహితంగా మెలిగేవాడు. క్రమంగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ క్రమంలో రోషన్ తనతోనే కాకుండా మరొక వ్యక్తితో కూడా చనువుగా ఉంటోందని అజిత్ అనుమానం పెంచుకున్నాడు. దాంతో ఎలాగైనా రోషన్‌ని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈ నేపథ్యంలో చింతామణి తాలుకా, మురగమల్లా‌లోని దర్గాలో పూజలు చేయిద్దాం అంటూ  నమ్మబలికి ఆమెను అక్కడికి తీసుకుని వెళ్లాడు.

దర్గాలో దర్శనం తరువాత ఊరి శివార్లలో ఉన్న మామిడితోటలోని షెడ్ వద్దకు తీసుకుని వెళ్ళి వేటకొడవలితో రోషన్ గొంతుకను కోసి,  ఆమె తలను మొండెం నుండి వేరు చేశాడు. ఆ తర్వాత రోషన్ తలను తీసుకుని వెళ్ళి శ్రీనివాసపురం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ సంఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

- Advertisement -