జగిత్యాల: ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు విద్యార్ధులు, మద్యం మత్తులో గొడవపడి చివరకు ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘోర ఘటన జగిత్యాల పట్టణంలో విజయపురి కాలనీలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం… విద్యానగర్‌కి చెందిన కుందారపు రవితేజ, విజయపురి కాలనీకి చెందిన కూసరి మహేందర్. ఇద్దరు స్నేహితులు… ఇద్దరు ఒకే స్కూల్లో పదవ తరగతి చదువుతున్నరు. రవితేజ, మహేందర్ ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని ప్రేమించారు. అ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలైయి… చివవకు ప్రాణలు తిసుకునే వరుకు వచ్చింది.
రవితేజ, మహేందర్, ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించడంతో ఇద్దరు తరచూ ఆ విషయంలో గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో ఆదివారం ఇద్దరు మరో స్నేహితుడితో కలిసి జగిత్యాలలోని మిషన్ కాంపౌండ్‌లో మద్యం తాగరు. తాగిన మైకంలో ఇద్దరూ గొడవ పడినట్లు తెలుస్తొంది. ఆ గొడవ ముదరడంతో ఒకరిపై ఒకరు పెట్రోలు పొసుకుని నిప్పంటించుకునన్నట్లు సమాచారం. ఈ గొడవ జరగడంతో వాళ్ళతో వచ్చిన మరో స్నేహితుడు భయంతో పారిపోయాడు. మంటల వల్ల మహేందర్ అక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిప రవితేజను జగిత్యాల ఆసుపత్రికి… అక్కడి నుండి కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తిసుకుంటూ రవితేజ ఆదివారం రాత్రి మృతి చెందాడు.
ఈ ఘటనపై పోలీసులు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు….
మహేందర్, రవితేజ ఇద్దరు ఒకరిపై ఒకరు పెట్రోలు పోనుకుని నిప్పంటించుకున్నరా? లేక మరో వ్యక్తి ప్రమేయం ఎమైనా ఉందా?, లేక అమ్మాయిని వేధిస్తున్నారు అంటూ మరెవరైనా ఈ ఘతుకానికి పునుకున్నారా? మొదలైన కోణల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటణకు స్థలం నుండి పారిపోయిన వాళ్ళ స్నేహితుడు ఆచూకి ఇప్పటి వరకు దొరకలేదు. అతను దొరికితే పూర్తి వివరాలు తెలుస్తాయి.
ఈ ఘటనపై జగిత్యాల సీఐ ప్రకాశ్ మాట్లాడుతూ ‘‘ ప్రేమ వ్యవహారమే ఇద్దరి మధ్య గొడవకు దారి తీసి ఉంటుందని ప్రాథమింకంగా భావిస్తున్నామన్నారు. ఘటనా స్థలంలో ముడో వ్యక్తి కూడా ఉన్నాడని మృతుల కంటుంబ సభ్యులు చెబుతున్నారని, దీనిపై కూడా పూర్తి దర్యాప్తు చేస్తున్నామని, సోమవారానికి పూర్తి స్పష్టత వస్తుందని’’ సీఐ తెలిపారు