హైదరాబాద్: కొంతమంది చిన్న చిన్న విషయాలకు కూడా మనస్థాపం చెంది.. బలావన్మరణానికి పాల్పడుతూ ఉంటారు. అలాంటి సంఘటన తాజాగా నగరంలోని కుకట్‌పల్లి పరిధిలో జరిగింది. ఓ వ్యక్తి భార్య ఆమ్లెట్ వెయ్యలేదని చెప్పి ఆమెతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ రోడ్డు నంబర్ 1లో నివాసం ఉంటున్న మహేశ్.. మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికొచ్చాడు. భార్య వనజను ఆమ్లెట్ వేసి
ఇవ్వమని అడిగాడు. అందుకు ఆమె ససేమిరా అనడంతో మహేశ్ కోపోద్రిక్తుడై భార్య వనజతో గొడవపడ్డాడు .
దాంతో వనజ వారు ఉంటున్న ఫ్లాట్ ఓనర్ దగ్గరకు వెళ్లి మహేశ్ గొడవ చేసిన విషయం చెప్పి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. ఆమె తలుపులు ఎంతగా కొట్టినప్పటికీ మహేశ్ తీయలేదు. దీంతో అనుమానం వచ్చి చూట్టు పక్కల వాళ్ళ సహాయంతో తలుపులు పగలకొట్టి చూడగా.. లోపల ఆమె భర్త మహేశ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు.
వెంటనే వాళ్ళు పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు ప్రారంభించారు.