షాకింగ్: మొబైల్ షాపు యజమాని రాసలీలలు! మహిళా కస్టమర్ల అశ్లీల వీడియోలు తీసి…

5:17 pm, Wed, 3 July 19
mobile-shop-owner-deceived-women-customers

మొగల్తూరు: ఓ మొబైల్ షాపు ఓనర్ రిఛార్జ్ తదితర అవసరాల కోసం తన దుకాణానికి వచ్చే మహిళా కస్టమర్లలో కొందరిని తన మాయమాటలతో నమ్మించి, వారి ఫొటోలు, వీడియోలు తీసి.. వారిని వలలో వేసుకోవడమేకాక వారితో ఏకాంతంగా తన శృంగార వాంఛలు తీర్చుకోవడమేకాక, ఆ సమయంలో రహస్యంగా వీడియోలను తీసి తన సెల్‌ఫోన్‌లో భద్రపరిచేవాడు.

అయితే అతడి వద్ద మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవడానికి వచ్చిన ఓ యువకుడి వాటిని చూసి తన మిత్రులకు షేర్ చేయడంతో అవి అలా అలా.. ప్రయాణించి చివరికి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో బాధిత మహిళలు షాక్‌కు గురై గుంభనంగా ఉండిపోగా, వారిలో ఒక బాధితురాలు మాత్రం ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది.

చదవండి: 50 మంది గృహిణులతో సెక్స్.. వీడి స్కెచ్ చూసి షాక్ తిన్న పోలీసులు!

ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు మండలంలోని ఓ గ్రామంలో తాజాగా చోటుచేసుకుంది. స్థానిక మహిళలకు సంబంధించి అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. చివరికి దీనికి కారణం.. లక్ష్మిసాయి సెల్ పాయింట్ పేరుతో మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ షాపు నిర్వాహకుడు, మరో యువకుడిగా తేల్చారు.

ఇలా వలలో వేసుకునేవాడు…

లక్ష్మిసాయి సెల్ పాయింట్ దుకాణం యజమాని రీఛార్జ్, సెల్‌ఫోన్ రిపేర్ల నిమిత్తం తన దుకాణానికి వచ్చే యువతులు, మహిళలతో తీయగా మాట్లాడేవాడు. ఎప్పుడు తన దుకాణానికి వచ్చినా వెంటనే వారి పని చేసి పెట్టేవాడు.

ఈ క్రమంలో కొంతమంది యువతులు, మహిళలకు అతడితో సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే వారిపై తనకు బాగా నమ్మకం కుదిరితేగాని వారి ఎదుట తన వాంఛ గురించి మాట్లాడేవాడు కాదు.

ఒకసారి వారు బుట్టలో పడ్డారని తెలియగానే తన నిజస్వరూపం బయటపెట్టేవాడు. కొంతమందితో ఏకాంతంగా గడిపి తన వాంఛలు తీర్చుకున్నాడు. రాసలీలల సమయంలో తెలివిగా వాటిని వీడియోలు తీసి తన మొబైల్ ఫోన్‌ మెమరీలో భద్రపరిచేవాడు.

చదవండి: చేతులు, కాళ్ళు కట్టేసి 51 రోజులపాటు ఆడపిల్లపై…! 

అతడి దగ్గర సెల్ ఫోన్ రిపేరింగ్ నేర్చుకోవడానికి వచ్చిన ఓ యువకుడు.. తన యజమాని ఫోన్‌లోని అశ్లీల చిత్రాలను చూసి కంగుతిన్నాడు. మెల్లమెల్లగా వాటిని తన మొబైల్ ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుని ఆ అశ్లీల వీడియోలను తాను చూడటమేకాక తన స్నేహితులకు కూడా షేర్ చేసేవాడు.

ఈ క్రమంలో ఆ అశ్లీల వీడియోలు ఒకరి నుంచి ఒకరికి షేర్ అవుతూ సోషల్ మీడియాలో కూడా ప్రత్యక్షమయ్యాయి. ఆ తరువాత వాట్సాప్ గ్రూపుల్లో కూడా చక్కర్లు కొట్టాయి.  తమకు బాగా తెలిసిన యువతులు, మహిళల ముఖాలు ఆ అశ్లీల వీడియోల్లో కనిపించడంతో చాలామంది షాక్ తిన్నారు.

అవి అలా అలా షేర్ అవుతూ.. ఏకంగా బాధిత మహిళల ఫోన్లకు కూడా చేరాయి. పలువురు మహిళలు వాటిని చూసి కూడా మిన్నకుండిపోయారు. కానీ ఒక మహిళ మాత్రం పోలీసులను ఆశ్రయించింది.

దీంతో వారు రంగంలోకి దిగి లక్ష్మిసాయి సెల్ పాయింట్ నిర్వాహకుడిని, ఆ దుకాణంలో పనిచేస్తోన్న యువకుడిని అదుపులోకి తీసుకుని వారి మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. సదరు సెల్ పాయింట్ నిర్వాహకుడి చేతిలో ఇప్పటికే పలువురు యువతులు, మహిళలు మోసపోయారని, కాబట్టి నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితులు పోలీసులను కోరారు.

చదవండి: దారుణం: భర్త కళ్లెదుటే భార్యపై గ్యాంగ్ రేప్.. ఆ పైన ఏం చేశారంటే…