విజయవాడ: ప్రస్తుతం సమాజం ఎటువైపుకి పోతుంది ఎవరికీ అర్థంకావడంలేదు. ఈ సమాజంలో ఎవరిని నమ్మాలో , ఎవరిని నమ్మకూడదో కూడా తెలియడంలేదు. అప్పటివరకు ఎంతో మంచిగా ఉన్న కొందరు, అదునుచూసుకొని తమ వక్రబుద్ధిని బయటపెడతారు. ఇలాంటి సంఘటనలు రోజుకి ఈ సమాజంలో ఎన్ని జరుగుతున్నా, దుర్మార్గుల చేతుల్లో నలిగిపోయే అమాయకమైన అమ్మాయిల జీవితాలని ఈ ప్రభుత్వాలు కాపాడలేకపోతున్నాయి .
16 ఏళ్ల బాలికను మాయమాటలు చెప్పి మోసం చేసిన మరో కామాంధుడు…
ఇకపోతే అసలు విషయానికొస్తే … ఇంట్లో పనికి కుదుర్చుకున్న 16 ఏళ్ల బాలికను మాయమాటలు చెప్పి లొంగదీసుకొని , గర్భవతిని చేశాడు ఒక కామాంధుడు. ఆ తరువాత పెళ్లి చేసుకోమని అడిగితే తిరస్కరించాడు. అబార్షన్ చేయించుకోమని, పరిహారంగా డబ్బులు కూడా ఇస్తామని చెప్పాడు. బాధితురాలు ఏమి చేయాలో తోచని స్థితిలో విషయం తల్లిదండ్రులతో చెప్పి ఘొల్లుమంది.
ఈ వ్యవహారం అంతా నడిపింది ఎవరో కాదు , ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. గిలకలాదిండి గ్రామంలో ఓ 30 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో తల్లీకూతుళ్లు పనిచేస్తున్నారు. తల్లికి మరో ఇంట్లో పని కుదరటంతో, 16 ఏళ్ల కూతురిని మాత్రమే ఆ ఇంట్లో పనికి పెట్టి వెళ్లిపోయింది.
కానీ , ఆ కామాంధుడు ఒంటరిగా బాలికపై కన్నేశాడు. ఒంటరిగా ఉన్న సమయంలో మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఫలితంగా బాలిక గర్భందాల్చింది. అనారోగ్యంతో ఉండటంలో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ అసలు విషయం బయటపడింది. ఈ విషయం గురించి బాలికను ప్రశ్నించగా దుర్మార్గుడు చేసిన అఘాయిత్యం గురించి చెప్పింది.
కొద్ది రోజుల క్రితం రాత్రి అర్జెంటు పని ఉందని ఇంటికి రప్పించుకుని, దారుణానికి ఒడిగట్టాడని చెప్పింది.
మూడునెలల గర్భవతి అని తెలిసి పెళ్లి చేసుకోమని అడిగితే తిరస్కరించాడని, అబార్షన్ చేసుకోమని చెప్పాడని, డబ్బులు కూడా ఇవ్వబోయాడని విలపించింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలికిపూడిలో ఉద్యోగం చేస్తున్న ఆ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
చదవండి: ఘోరం: బౌద్ధారామాల వద్ద యువతిపై అత్యాచారం, హత్య, పక్కనే తీవ్రగాయాలతో యువకుడు








