26.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ అర్జున్ రెడ్డి దర్శకుడికి నో చెప్పిన మహేష్! అసలు కారణం ఇదే!

అర్జున్ రెడ్డి దర్శకుడికి నో చెప్పిన మహేష్! అసలు కారణం ఇదే!

Mahesh Babu
- Advertisement -

హైదరాబాద్: అర్జున్ రెడ్డి’ సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హిందీలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన మహేశ్ బాబుతో ఒక సినిమా చేసే ఛాన్స్ వున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పట్లో ఆ సినిమా వుండకపోవచ్చనేది తాజా సమాచారం.

హీరో క్యారెక్టరైజేషన్ నచ్చకే…

మహేశ్ బాబు కోసం తాను సిద్ధం చేసిన కథను ఇటీవల ఆయనకి సందీప్ రెడ్డి వినిపించాడట. హీరో క్యారెక్టరైజేషన్ తన బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా లేదని మహేశ్ బాబు చెప్పినట్టుగా సమాచారం. ఈ స్క్రిప్ట్ పక్కన పెట్టేసినా .. భవిష్యత్తులో తప్పకుండా కలిసి చేద్దామని సందీప్ కి మాట ఇచ్చాడట.

ఈ నేపథ్యంలో ‘కబీర్ సింగ్’ హిందీ సినిమా తరువాత సందీప్ ఏ హీరోతో సెట్స్ పైకి వెళతాడనేది ఆసక్తికరంగా మారింది. కాగా ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 25 న మన ముందుకి రానుంది.

చదవండి: మహర్షిపై మహేష్ క్లారిటీ! ఏప్రిల్ 25 విడుదల ఫిక్స్!

- Advertisement -