
ఇస్లామాబాద్: భారత పైలట్ అభినందన్ వర్ధమాన్‌ను విడుదల చేయాలంటూ పాకిస్థాన్‌లో పౌర సంఘాలు నినదించాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చల్లబరిచి, శాంతి నెలకొనేలా చేయాలన్న నినాదాలతో పలు నగరాల్లో ప్రదర్శనలు నిర్వహించాయి. యుద్ధం రావాలని కోరుకోవడం లేదని పాకిస్థానీయులు పేర్కొన్నారు.
యుద్ధం వస్తే ఇద్దరికి నష్టమే…
భారత్-పాక్ కాల్పుల విరమణకు కట్టుబడాలని ఆకాంక్షించారు. పాకిస్థాన్ మానవ హక్కుల సంఘం, ఆస్మా జహంగీర్ లీగల్ ఎయిడ్ సెల్, బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్(బీఎల్ఎల్ఎఫ్), సౌత్ ఆసియా పార్టనర్షిప్ పాకిస్థాన్(ఎస్ఏపీ-పీకే), వుమెన్ యాక్షన్ ఫోరమ్(డబ్లూఏఎఫ్), అవామీ వర్కర్స్ పార్టీ తదితర సంస్థలు పాకిస్థాన్ వ్యాప్తంగా శాంతి ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాయి.
లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్, కరాచీ నగరాల్లో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యవాదులు పాల్గొన్నారు. అభినందన్‌ను విడుదల చేయాలంటూ ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్శించి, శాంతి గీతాలు ఆలపించారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Protests against war took place all over Pakistan. This is a huge win for the civil society which has been under constant crackdown since last few years. Here is a video from Islamabad. Many people had banners asking for #Abhinandhan’s release #PakIndiaCeasefire #MakeChaiNotWar pic.twitter.com/aNapExVnyT
— Ammara Ahmad ਅਮਾਰਾ ਅਹਿਮਦ (@ammarawrites) February 28, 2019
పాకిస్థాన్‌లో అత్యధిక శాతం మంది ప్రజలు యుద్ధం కోరుకోవడం లేదని వుమెన్ ఇన్ స్ట్రగుల్ ఫర్ ఎంపర్మెంట్(డబ్ల్యూఐఎస్‌ఈ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బుష్రా ఖాలిక్ తెలిపారు. యుద్ధం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా నష్టపోతారు.
వారికి అండగా నిలిచే కుటుంబ సభ్యులను కోల్పోతారు. యుద్ధం వస్తే రెండు తీవ్రంగా నష్టపోతాయని అన్నారు. కాగా, అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో భారత పైలట్ అభినందన్‌ను విడుదల చేయాలని పాకిస్థాన్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
సంబంధిత వార్తలు :
- భారత్ మెరుపు దాడులు: పాక్ ఉగ్ర స్థావరాలు సర్వనాశనం
- విరుచుకుపడ్డ భారత వాయుసేన.. జైషే మహ్మద్ ఆల్ఫా-3 కంట్రోల్ రూమ్స్ ధ్వంసం! ఎక్స్ క్లూజివ్ వీడియో…
- పుల్వామా ఘటనపై ప్రతీకారం తీర్చుకున్న భారత్! వైమానిక దాడిని ధ్రువీకరించిన పాకిస్తాన్…
- ఇండియాస్ అమేజింగ్ ఫైటర్స్! భారత వాయుసేనకు ప్రశంసల వెల్లువ…
- పాక్ పై దాడికి కారణాలు వెల్లడించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే!
- వైమానిక దాడులు: మోదీ అత్యవసర కేబినెట్ సమావేశం
- సర్జికల్ స్ట్రయిక్స్ 2.0: సత్తా చాటిన మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్! కార్గిల్ యుద్ధంలోనూ జైత్రయాత్ర…
- శత్రువు ముందు తలొగ్గి ఉంటె బలహీనులమని కాదు! వైరల్ అవుతున్న ఆర్మీ ట్విట్!
- ‘సురక్షితమైన చేతుల్లోనే భారత్’: ఐఏఎఫ్ మెరుపుదాడిపై ప్రధాని మోడీ ఏమన్నారంటే…
- ప్రతిదాడికి సిద్ధమై.. వెనక్కి తగ్గిన పాక్ ఎయిర్ ఫోర్స్! సాయం కోసం చైనాకు ఫోన్, కానీ…
- లోపల గుబులు, పైకి గాంభీర్యం.. ఆదినుంచీ పాక్ ఎత్తుగడే ఇదే: భారత్ వైమానిక దాడిపై పాక్ ఇలా…
- దేనికైనా సిద్ధంగా ఉండండి: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, తమ భూభాగంలో భారత వైమానిక దాడిపై సీరియస్…
- పుల్వామాలో ఉగ్ర దాడి తర్వాతి రోజే మెరుపు దాడులకు గ్రీన్ సిగ్నల్!: అంతా సీక్రెట్‌గానే..
- రాత్రంతా జాగారం: మోడీ పూర్తి పర్యవేక్షణలోనే సర్జికల్ స్ట్రైక్స్ 2.0
- పాక్‌పై వైమానిక దాడిలో హైదరాబాదీ పైలట్! మిరాజ్ పైలట్లకు సిటీలోనే శిక్షణ?
- సర్జికల్ స్ట్రయిక్స్-2 కోసం భారత్ ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- షాకింగ్: కశ్మీర్లో కుప్పకూలిన భారత యుద్ధ విమానం! పాకిస్తాన్ కూల్చేసిందా?
- ఇదే అంతిమ యుద్ధం కావొచ్చు! పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
- మా అదుపులోనే ఇద్దరు ఐఏఎఫ్ పైలట్లు: పాక్, వీడియో రిలీజ్, ఒక పైలట్ అదృశ్యమంటూ భారత్
- ప్రసంగం మధ్యలో వెళ్లిపోయిన మోదీ! కారణం ఇదేనా!
- భారత పైలట్‌పై పాక్ అమానుషం! అభినందన్ స్వస్థలం కేరళ!
- అమెరికా బిన్‌లాడెన్‌ను చంపినట్లే మేమూ చేయగలం: జైట్లీ
- ఒక్కసారి యుద్ధం మొదలైతే మన చేతుల్లో ఉండదు: చర్చలకు సిద్ధమంటూ ఇమ్రాన్
- మసూద్ అజార్‌పై నిషేధం విధించాల్సిందే: భారత్‌కు మద్దతుగా అగ్రదేశాలు








