గ్రేట్: మోకాలు రక్తమోడుతున్నా ఆట మాత్రం ఆపలేదు! చెన్నై కోసం చివరిదాకా పోరాడిన వాట్సన్…               

- Advertisement -

హైదరాబాద్:  హైదరాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కేవలం ఒక్క పరుగు తేడాతో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ ఒక్కడే 80 పరుగులు చేసి..మ్యాచ్‌ని గెలిపించెంత పని చేశాడు.

కానీ ఆఖరి ఓవర్లో రనౌట్ అవ్వడం వలన విజయం ముంబై వైపుకు వెళ్లిపోయింది. అయితే వాట్సన్ రనౌట్ అవ్వడానికి గల కారణం ఏంటో తెలిసి… అభిమానులు వాట్సన్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

చదవండిఒక రీప్లేలో అలా.. మరో దాంట్లో ఇలా: ధోనీ రనౌట్ నిర్ణయంపై అభిమానుల ఆగ్రహం!

అసలు ఏం జరిగిందంటే?

ముంబై నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్‌కి చేరుతున్నా… వాట్సన్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలోనే వాట్సన్ మోకాలికి పెద్ద దెబ్బ తగిలింది.

అది ఎంత పెద్ద గాయం అంటే, ఆ దెబ్బకు కారిన రక్తం వలన ప్యాంట్‌ తడిసిపోయింది. ఎడమ మోకాలికి గాయమై, రక్తం కారిపోతున్నా, చెన్నైవిజయం కోసం వాట్సన్ ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే భరించలేని బాధతో వికెట్ల మధ్య పరిగెత్తలేక రన్ అవుట్ అయ్యాడు.

అయితే వాట్సన్ గాయానికి సంబంధించిన వివరాలను చెన్నై ఫ్రాంచైజీ యాజమాన్యం అధికారికంగా వెల్లడించకపోయిన….  వాట్సన్ కాలి నుంచి రక్తం కారుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దానికి సంబంధించిన దృశ్యాలని హర్భజన్ సింగ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నాడు.

చదవండి: 2019 ఐపీఎల్ అవార్డు విన్నర్ల లిస్ట్ ఇదే!
- Advertisement -