చెన్నై సూపర్ కింగ్స్‌కు పెద్ద ఊరట.. ఆటగాళ్లందరికీ కరోనా నెగటివ్

- Advertisement -

దుబాయ్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) జట్టుకు ఇది పెద్ద ఊరటనిచ్చే వార్తే. ఇటీవల ఇద్దరు ఆటగాళ్లు సహా పది మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో జట్టు మేనేజ్‌మెంట్‌, బీసీసీఐతో పాటు మిగతా ప్రాంఛైజీలు కూడా షాక్‌కు గురయ్యాయి.

ఇటీవల కరోనా బారినపడిన ఇద్దరు ఆటగాళ్లతో పాటు మిగతా సహాయ సిబ్బందికి తాజాగా నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో వారందరికీ కరోనా నెగటివ్ అని రిపోర్టులు వచ్చినట్టు సమాచారం.

చెన్నైకి చెందిన బౌలర్‌ దీపక్‌ చాహర్‌, యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌కు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వీరిని ఐసోలేషన్‌లో ఉంచారు.

వీరందరినీ బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. ఇప్పటి వరకు శిక్షణను ప్రారంభించకపోవడంతో చెన్నై జట్టు ఇబ్బంది పడుతోంది.

నెగెటివ్‌గా తేలిన వారంతా సాధనలో పాల్గొనాలంటే ఈ నెల 3న నిర్వహించే కరోనా పరీక్షల్లో ఫలితం మళ్లీ నెగటివ్ రావాల్సి ఉంటుంది.

నిబంధనల ప్రకారం ఈ నెల 12 వరకు చాహర్‌, గైక్వాడ్‌ క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.

- Advertisement -