
న్యూఢిల్లీ, 2 సెప్టెంబరు 2026 : ఇండియా వర్సెస్ అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ జట్టు సెలక్షన కమిటీ మంగళవారం ప్రకటించింది. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడి శ్రీలంకతో టెస్టు సిరీస్‌కూ దూరమైన స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను కూడా తిరిగి భారత జట్టులోకి ఎంపిక చేసింది.
ఢిల్లీ వేదికగా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈనెల 13, 15, 17 తేదీల్లో అఫ్గాన్ క్రికెట్ జట్టుతో.. మూడు టీ20లు భారత జట్టు ఆడనుంది. ఈ సిరీస్ కోసం తాజాగా భారత జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ.. మొత్తం 15 మంది సభ్యుల్లో బుమ్రా పేరు కూడా చేర్చింది.
ఫిట్‌నెస్ పరీక్షలు పాస్ అయితేనే…
అయితే ఈ సిరీస్‌లో అతడు బరిలోకి దిగేదీ లేనది అనుమానమే. ఫిట్‌నెస్ పరీక్షల్లో బుమ్రా పాస్ అయితేనే అతడు మైదానంలోకి అడుగుపెడతాడు.
బుమ్రాతో పాటు ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, పేసర్ హర్షిత్ రాణాను కూడా అఫ్గాన్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే ఈ నలుగురు కూడా ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే జట్టులో కొనసాగుతారు.
జింబాబ్వే సిరీస్‌కు దూరమైన సంజూ శాంసన్ జట్టులోకి తిరిగి రాగా.. మరో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం ఈ సిరీస్‌కూ దూరమయ్యాడు.
భారత జట్టు: శ్రేయస్ (కెప్టెన్), అభిషేక్, వైభవ్, శాంసన్, ఇషాన్, తిలక్, దూబే, నితీశ్ రెడ్డి, అక్షర్, సుందర్, చక్రవర్తి, బిష్ణోయ్, బుమ్రా, అర్ష్‌దీప్, హర్షిత్.








