- Advertisement -
పంజాబ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ నయా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో 350 సిక్సర్లు బాదిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
నిన్న (సోమవారం) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లో సిక్స్ బాది ఈ ఫీట్ అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు మరే ఇతర ఆటగాడు కనీసం 250 సిక్సర్ల మార్కును కూడా చేరుకోలేదు.
సౌతాఫ్రికా సూపర్ స్టార్ ఏబీ డివిలియర్స్ 237 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 133 మ్యాచ్‌లు ఆడిన గేల్ 351 సిక్స్ బాదాడు. కాగా, నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన తొలి పోరులో పంజాబ్ కింగ్స్ బోణీ చేసింది.
- Advertisement -