తిరుపతిలో చంద్రబాబుపై రాళ్ల దాడి.. కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు

- Advertisement -

న్యూఢిల్లీ: తిరుపతి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై నిన్న జరిగిన రాళ్ల దాడి నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీల బృందం నేడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది.

టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ను కలిశారు.

ఘటనపై ఫిర్యాదు…

తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభలో చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో పోలింగ్ నిర్వహించాలని టీడీపీ ఎంపీలు కోరారు.

పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. నియోజకవర్గంలో 2 లక్షల నకిలీ ఓటరు కార్డులు ఉన్నాయని, రెండు అదనపు గుర్తింపు కార్డులు ఉంటేనే ఓటు వేసే అవకాశం ఇవ్వాలని కోరారు.

పోలింగ్ కేంద్రాల్లో పరిశీలకులను నియమించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంలో క్రియాశీలంగా ఉన్న వలంటీర్లకు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అడ్డుకోవాలని ఎన్నికల కమిషర్‌ను విజ్ఞప్తి చేశారు.

- Advertisement -